Senior actor Thulasi : చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి హీరోయిన్ గా, హీరో చెల్లి పాత్ర, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తల్లిగా మెప్పించిన నటి తులసి మూడువందలకు పైగా సినిమాల్లో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు అందరు అగ్ర హీరోలా సినిమాల్లో నటించిన తులసి అందరు గొప్ప దర్శకుతో పని చెయడం గొప్పగా ఉంటుంది అంటూ చెప్పారు. ఇక సినిమాల్లో కే విశ్వనాథ్ గారి సినిమాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది అందునా ‘శంకరాభరణం’ సినిమాలో శంకర్ శాస్త్రి వద్ద అబ్బాయిగా తులసి నటన అందరినీ అక్కట్టుకుంటుంది. ఆ ఒక్క సినిమాతో నటనలో వంద మెట్లు ఎక్కేసింది తులసి. ఇక ఈ మధ్యనే విడుదల అయిన ‘కార్తికేయ 2’ సినిమాలో కూడా తన నటనతో అందరినీ మరోసారి ఆకట్టుకున్నారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నపుడు సీనియర్ నటులతో పనిచేసిన తులసిగారు ఆ అనుభవాలను పంచుకున్నారు.
ఎన్టీఆర్ గారు ఒళ్ళో కూర్చోబెట్టుకుని అలా…
ఎన్టీఆర్ గారితో తన జ్ఞాపకాలను చెబుతూ తులసి గారు తనకు కంటికి దెబ్బ తగిలి కుట్లు పడినా షూటింగ్ లో పాల్గొన్న సంఘటన గురించి చెప్పారు. ‘మా వారి మంచితనం’ సినిమా షూటింగ్ కి ముందు తమ్ముడు చెల్లి ఆడుకుంటూ తాళం కంటికి గుచ్చుకుని కుట్లు పడ్డాయాట. ఆ తరువాత మూడు రోజులకే మా వారి మంచితనం షూటింగ్ లో కృష్ణుడి వేషం వేయాలి. దీంతో మేకప్ అపుడు కుట్లు దగ్గర మేకప్ చేస్తుంటే నొప్పి ఉండేది.
అపుడు ఎన్టీఆర్ గారు పిలిచి నీకు కుట్లు పడ్డాయి కదా మేకప్ వేసే సమయంలో నొప్పించలేదా అంటే లేదు కొంచెం నొప్పి ఉంది అంటూ చెప్పగానే ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దుపెట్టేవారు అంటూ తులసి గారు ఎన్టీఆర్ గారి వ్యక్తిత్వం గురించి చెప్పారు. ఇక రోజూ మేకప్ క్లీన్ చెయించి డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళమని ఎన్టీఆర్ గారు పుండారీకాక్షయ్య గారికి పురమాయించేవరంటూ చెప్పారు. ఇక వాణిశ్రీ గారికి నాకు ప్రత్యేక అనుబంధం ఉందని తులసి గుర్తు చేసుకున్నారు. ఇక ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు కూడా చాలా బాగా చూసుకునేవారంటూ అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…