Movie News

Actress Kushbu: ఆమెను తలుచుకొని షో లోనే కన్నీళ్లు పెట్టుకున్న కుష్బూ.. వైరల్ వీడియో?

Actress Kushbu: బుల్లితెర పై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది.ఈ కార్యక్రమం మొదట్లో జబర్దస్త్ కార్యక్రమం ఒకటే కొనసాగుతుండగా ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ రావడంతో ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం ప్రసారమవుతు పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తోంది.

ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా తమదైన శైలిలో పెర్ఫార్మెన్స్ చేస్తూ అందరిని నవ్వించారు. ఇక గెటప్ శీను ఈసారి టైం ఫాంటసీ స్కిట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా తన స్కిట్ తో అందరిని సందడి చేశారు.

అనంతరం యాంకర్ రష్మీ మాట్లాడుతూ ఒకవేళ టైం ట్రావెల్ చేస్తే ఏం జరగాలని కోరుకుంటారు అంటూ అందరిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇదే ప్రశ్నను యాంకర్ రష్మీ జడ్జి స్థానంలో ఉన్నటువంటి కుష్బూని అడగడంతో కుష్బూ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఏకంగా ఎమోషనల్ అవ్వడమే కాకుండా కన్నీళ్లు పెట్టుకున్నారు.

Actress Kushbu: ఆమె ఎప్పటికీ నాతోనే ఉండాలి…

ఈ సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి 1984లో ఇండస్ట్రీలోకి వచ్చాను. అదే సమయంలో తన హెయిర్ డ్రెస్సర్ ఉబెన్ ఆంటీ వచ్చారు.ఆమె నాతోపాటు 2011 వరకు కలిసి ఉంది. అయితే క్యాన్సర్ తో ఆమె 2011లో మరణించారు. ఒకవేళ నేనే కనుక జీవితంలో వెనక్కి వెళ్లాల్సి వస్తే ఆమె ఎప్పటికీ నాతోనే ఉండాలని కోరుకుంటాను అంటూ కుష్బూ ఒక్కసారిగా తన హెయిర్ డ్రెస్సర్ ను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago