Nayanathara-Vignesh Shivan: చంద్రముఖి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార నాలుగు నెలల క్రితం విగ్నేష్ శివన్ అనే తమిళ దర్శకున్ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
వీరి వివాహం జరిగినప్పటి నుండి ఇద్దరు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన ఈ దంపతులపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిబంధనలకు వ్యతిరేకంగా నయనతార దంపతులు పెళ్లయిన నాలుగు నెలలకే ఇలా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనివ్వడంతో తీవ్రదుమారం రేపుతుంది.
విచారణలో భాగంగా తమకి ఆరు సంవత్సరాల క్రితమే పెళ్లి అయినట్లు దంపతులు ప్రభుత్వానికి తెలియజేశారు. అంతేకాకుండా ఏడాది క్రితమే సరోగసి కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కూడా వెల్లడించారు.
అయితే నయన్ విగ్నేష్ రిజిస్ట్రేషన్ పెళ్లికి సంబంధించిన ఆధారాలతో పాటు ఏడాది క్రితం సరోగసి కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆధారాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ ఆధారాలు సంపాదించే పనిలో నయన్ దంపతులు ఉన్నారు. అయితే ఈ విషయంలో నయన్ దంపతులు ప్రభుత్వానికి ఆధారాలు సమర్పించలేదని… ఈ విషయంలో వీరిద్దరితో పాటు సరోగసికి సహకరించిన మరో వ్యక్తికి కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం నుండి నయనతార దంపతులు ఎలా బయటపడతారో చూడాలి మరి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…