Colours Swathi: బుల్లితెర మీద ప్రసారమైన కలర్స్ అనే షోకి యాంకర్ గా వ్యవహరించిన స్వాతి.. కలర్ స్వాతిగా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత అష్టా చమ్మ సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన స్వాతి హీరోయిన్ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైన కలర్ స్వాతి పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది.
తాజాగా నవీన్ చంద్ర, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన ‘అమ్ము ‘ సినిమా ప్రీమియర్ షో కి హాజరయ్యింది.
చారుకేశ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కీలకపాత్రలో నటించింది. ఈ సినిమాలో నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఇక ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు నిర్మాతగా వ్యవహరించాడు.
ఈ సినిమాని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీమియర్ షోకి హాజరైన కలర్ స్వాతి నవీన్ చంద్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ సినిమాలో నవీన్ చంద్ర తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో నవీన్ చంద్ర ఒక శాడిస్ట్ భర్తగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు.
ఈ సినిమాలో అతన్ని చూసి నేను షాక్ అయ్యాను. ఈ సినిమాలో నవీన్ నీ చూసి నాకు భయం వేసింది. నవీన్ చంద్ర ఇంటర్వెల్ సమయంలో నాతో మాట్లాడటానికి వస్తే నా దగ్గరకు రాకు దూరంగా వెళ్ళిపో అంటూ అతని మీద అరిచాను. ఆ పాత్రలో నవీన్ చంద్ర లీనమై నటించాడు అంటూ నవీన్ చంద్ర నటన గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. కలర్ స్వాతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…