Anasuya trolled for tweet on RRR : ఎపుడు సోషల్ మీడియా లో చురుకుగా ఉండే అనసూయ ఏదో ఒక విషయానికి నెటిజన్స్ ట్రోల్ కి గురవ్వడం మాములే. ఇటీవలే అనసూయ పొట్టి బట్టలేసుకుని హాట్ ఫోటో షూట్ చేయడం తో ఇద్దరు పిల్లల తల్లి వి ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అంటూ ఒక నెటిజెన్ స్పందించడం తో మహిళలను గౌరవించడం పై నీతులు చెప్పింది. అంతకు ముందు కూడా ఇలాంటి ఎన్నో ఘాటు నెగెటివ్ కామెంట్లను ఎదుర్కొన్న ఈ జబర్దస్త్ యాంకర్ అందుకు ధీటుగా కౌంటర్లు వేస్తూ ఉంటుంది.
ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ట్రోల్ కి గురైన అనసూయ……
ఇక తాజాగా మరోసారి ట్రోల్ కి గురైంది అనసూయ అయితే ఈసారి తన వస్త్రాధారణ విషయంలో కాదు సినిమా స్పందన విషయం లో.అనసూయ భరద్వాజ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి సోషల్ మీడియాలో తన రివ్యూని షేర్ చేసింది. అనసూయ తన ట్విట్టర్లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అని రాసి దాంతో పాటు లవ్ సింబల్‌ను, వండరల్‌ఫుల్ అనే చెప్పేలా ఓ ఎమోజీని జత చేసి.. ‘దట్స్ ఇట్.. దట్స్ ది ట్వీట్’ అంటూ పేర్కొంది. ఈ ట్వీట్ రెండు రకాల అర్థాలు వచ్చే విధంగా ఉంది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
గతంలో కూడా ఇలాగే ఒక స్టార్ హీరో కి సంబంధించిన సినిమాలో తనకు నటించే అవకాశం లభించడంతో ‘ఆ స్టార్ హీరో అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. నాకు ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఇన్నాళ్లు వెయిట్ చేసినట్టు’ అర్ధం వచ్చేలా కామెంట్లు చేసింది. అలా రెండు అర్థాలు వచ్చేలా మాట్లాడినందుకు ట్రోల్ కి గురైంది. ఇక ఇపుడు మళ్ళీ అలానే రెండు అర్థాలు వచ్చేలా పోస్ట్ పెట్టిందని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఆ అనే టాగ్ తో ట్రోల్ చేస్తున్నారు.ఇక అపుడు సోషల్ మీడియా లో చురుకుగా ఉండే అనసూయ నేటిజనుల కామెంట్స్ కి కౌంటర్లు వేసే అనసూయ ఇపుడు మౌనంగా ఉంది ఈ విషయం. పై స్పందించలేదు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. తాజా గా రేటింగ్ సంస్థ IMDB టాప్ 5 సినిమాల జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ సినిమాగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…
భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…
ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…
వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…
వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…