Featured

S P Charan emotional about his Father : తండ్రి ని తలుచుకుని కన్నీరు పెట్టిన ఎస్ పి చరణ్…. కంట తడి పెట్టుకున్న గాయని సునీత…!

S P Charan emotional about his Father : పాటలు అనగానే గాయకులు గుర్తొస్తారు వాళ్ల గాత్రంతో మనలను అలరిస్తారు ఇక తెలుగు సినీ పరిశ్రమలో గాయకులనగానే ఘంటసాల గారి తర్వాత గుర్తొచ్చేది ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారే. కరోనా సెకండ్ వేవ్ లో ఆయన కరోనా తో పోరాడి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల తుది శ్వాస విడిచారు. ఆయన లేని లోటు సంగీత ప్రపంచానికి తీరనిది.ఆయన వారసుడిగా సినీ గాయకుడిగా వచ్చిన ఎస్ పి చరణ్ తండ్రి లాగా తాను మంచి గాయకుడిగా పేరు పొందాడు. ఇక ఆయన వారసుడిగా పాడుతా తీయగా కార్యక్రమం ను నడిపిస్తున్నారు.

పాట పాడుతూ కన్నీరు పెట్టుకున్న చరణ్….

పాడుతా తీయగా కార్యక్రమం ను నడుపుతున్న చరణ్ జడ్జిలుగా సునీత, విజయ్ ప్రకాష్, చంద్రబోస్ లు వ్యవహరిస్తున్నారు. ఈ షో చాలా విజయవంతంగా సాగిపోతోంది. అందులో భాగంగా ఓ సింగర్‌ ప్రియతమా.. అనే పాటని పాడుతున్నాడు. దీనిపై పరిచయ వ్యాఖ్యలు ఇస్తూ ఎస్పీ చరణ్‌ స్పందించారు. ముందు ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట.. ఇప్పుడు చాలా కష్టమైన పాట అంటూ బరువెక్కిన గుండెతో మాట్లాడారు. దీంతో అక్కడున్న వారంతా ఎమోషనల్ అయ్యారు. ఇక జడ్జి గా వ్యవహరిస్తున్న సునీత కన్నీరు పెట్టుకున్నారు. అక్కడే ఉన్న విజయ్ ప్రకాష్ చరణ్ ను ఓదార్చే ప్రయత్నం చేసారు. సింగర్‌ పాడుతున్న ఆ పాటలోని చరణాలను వర్ణిస్తూ..శిలలాంటి నాకు జీవాన్ని పోశారు. కళతోని నింపి.. అర్థాలు..` అంటూ తాను చెప్పదలచుకున్న మాటలు రావడం లేదు. దీంతో స్టేజ్‌పైనే భావోద్వేగానికి గురయ్యారు ఎస్పీ చరణ్‌.

ఇక ఈ సంఘటనతో షో మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయింది. అందరు భావొద్వేగానికి లోనవడంతో ఇపుడు ఈ వీడియో వైరల్ అయింది. ఇక ఈ వీడియో చూసిన ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అవ్వడం విశేషం. ఎస్ పి బాలు కి సునీతకు మధ్య అనుబంధాన్ని చెప్పక్కరలేదు. ఎన్నో ఏళ్ళు షో ను విజయవంతంగా నడిపారు అదే కాకుండా వీళ్లిదరు కలిసి ఎన్నో పాటలను కలిసి పడడం వల్ల సునీత చాలా ఎమోషనల్ అయ్యారని అందరూ భావిస్తున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఖాళీ కడుపుతో వాకింగ్‌ చేస్తున్నారా..? ఈ ప్రమాదాలు మీకూ రావొచ్చు!

ఉదయం వాకింగ్‌ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. బరువు నియంత్రణ నుంచి గుండె ఆరో్యం వరకు ఎన్నో…

2 hours ago

వేసవిలో ఫ్రిజ్‌ వాటర్‌కు అలవాటు పడితే శరీరంలో ఏమవుతుంది?

వేసవి కాలంలో ఎండలు పెరిగిపోవడంతో చాలామంది చల్లటి నీళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే…

2 hours ago

మామిడిపండ్లు ఎక్కువగా తింటే సెగడ్డలు వస్తాయా..? వేసవిలో సెగడ్డలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వేసవి కాలంలో మామిడిపండ్లు అంటే చాలా మందికి ప్రత్యేకమైన ఇష్టం. రోజూ మామిడి తినకుండా ఉండలేని వారూ ఉంటారు. అయితే…

2 hours ago

వేసవి సెలవుల్లో పిల్లలకు స్విమ్మింగ్ క్లాసులు.. పేరెంట్స్ తప్పక గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు!

వేసవి వచ్చిందంటే పిల్లలకు సెలవులు, ఆటలు, సరదాలు మొదలవుతాయి. ఈ సమయంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను స్విమ్మింగ్ క్లాసులకు…

2 hours ago

వేసవిలో ద్రాక్ష తింటే కలిగే లాభాలు తెలుసా? శరీరానికి చల్లదనం నుంచి ఇమ్యూనిటీ వరకు ఎన్నో ప్రయోజనాలు!

వేసవి కాలం వచ్చిందంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో…

3 hours ago

కైలాస మానస సరోవర యాత్ర 2026.. భక్తులకు గుడ్‌న్యూస్! దరఖాస్తులకు చివరి తేదీ సమీపంలోనే!

హిందువుల అత్యంత పవిత్ర తీర్థయాత్రల్లో ఒకటిగా భావించే కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. 2026…

3 hours ago