S P Charan emotional about his Father : పాటలు అనగానే గాయకులు గుర్తొస్తారు వాళ్ల గాత్రంతో మనలను అలరిస్తారు ఇక తెలుగు సినీ పరిశ్రమలో గాయకులనగానే ఘంటసాల గారి తర్వాత గుర్తొచ్చేది ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారే. కరోనా సెకండ్ వేవ్ లో ఆయన కరోనా తో పోరాడి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల తుది శ్వాస విడిచారు. ఆయన లేని లోటు సంగీత ప్రపంచానికి తీరనిది.ఆయన వారసుడిగా సినీ గాయకుడిగా వచ్చిన ఎస్ పి చరణ్ తండ్రి లాగా తాను మంచి గాయకుడిగా పేరు పొందాడు. ఇక ఆయన వారసుడిగా పాడుతా తీయగా కార్యక్రమం ను నడిపిస్తున్నారు.

పాట పాడుతూ కన్నీరు పెట్టుకున్న చరణ్….
పాడుతా తీయగా కార్యక్రమం ను నడుపుతున్న చరణ్ జడ్జిలుగా సునీత, విజయ్ ప్రకాష్, చంద్రబోస్ లు వ్యవహరిస్తున్నారు. ఈ షో చాలా విజయవంతంగా సాగిపోతోంది. అందులో భాగంగా ఓ సింగర్ ప్రియతమా.. అనే పాటని పాడుతున్నాడు. దీనిపై పరిచయ వ్యాఖ్యలు ఇస్తూ ఎస్పీ చరణ్ స్పందించారు. ముందు ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట.. ఇప్పుడు చాలా కష్టమైన పాట అంటూ బరువెక్కిన గుండెతో మాట్లాడారు. దీంతో అక్కడున్న వారంతా ఎమోషనల్ అయ్యారు. ఇక జడ్జి గా వ్యవహరిస్తున్న సునీత కన్నీరు పెట్టుకున్నారు. అక్కడే ఉన్న విజయ్ ప్రకాష్ చరణ్ ను ఓదార్చే ప్రయత్నం చేసారు. సింగర్ పాడుతున్న ఆ పాటలోని చరణాలను వర్ణిస్తూ..శిలలాంటి నాకు జీవాన్ని పోశారు. కళతోని నింపి.. అర్థాలు..` అంటూ తాను చెప్పదలచుకున్న మాటలు రావడం లేదు. దీంతో స్టేజ్‌పైనే భావోద్వేగానికి గురయ్యారు ఎస్పీ చరణ్.
ఇక ఈ సంఘటనతో షో మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయింది. అందరు భావొద్వేగానికి లోనవడంతో ఇపుడు ఈ వీడియో వైరల్ అయింది. ఇక ఈ వీడియో చూసిన ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అవ్వడం విశేషం. ఎస్ పి బాలు కి సునీతకు మధ్య అనుబంధాన్ని చెప్పక్కరలేదు. ఎన్నో ఏళ్ళు షో ను విజయవంతంగా నడిపారు అదే కాకుండా వీళ్లిదరు కలిసి ఎన్నో పాటలను కలిసి పడడం వల్ల సునీత చాలా ఎమోషనల్ అయ్యారని అందరూ భావిస్తున్నారు.
































