Movie News

Anasuya: నాకు ఎలాంటి రోగం ఉంది… వైరల్ అవుతున్న అనసూయ పోస్ట్..!

Anasuya: బుల్లితెర గ్లామర్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలో సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందింది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ బాగా క్రేజ్ సంపాదించుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత అనసూయ పేరు రంగమ్మత్తగా మారిపోయింది. బుల్లితెర మీద ఎంతో గ్లామరస్ గా కనిపించే అనసూయ సినిమాలలో మాత్రం డి గ్లామర్ పాత్రలలో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇలా టీవీ షోలు సినిమాలు చేస్తూ బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే పోస్టుల వల్ల విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది.

సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేసే వారికి అనసూయ గట్టి కౌంటర్స్ ఇస్తూ ఉంటుంది. ఇలా తరచూ తన పోస్టుల వల్ల వివాదాల్లో నిలిచే ఈమె తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో..” నాకో వ్యాధి ఉంది.నా గురించి చెడుగా మాట్లాడే వారిని నేను అస్సలు పట్టించుకోను.” అంటూ వీడియో షేర్ చేసింది. అనసూయ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Anasuya: వారిని అస్సలు పట్టించుకోను…


ఇలా తనని ట్రోల్ చేసేవారికి మరొకసారి అనసూయ ఇలా కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్ల పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొంతమంది మాత్రం ఎప్పటిలాగే అనసూయని ట్రోల్ చేస్తూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బుల్లితెరకు దూరమైన అనసూయ ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో కూడా కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. అలాగే దర్శకుడు క్రిష్ సమర్పణలో రూపొందుతున్న మరొక వెబ్ సిరీస్ లో కూడా అనసూయ నటిస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago