Movie News

Ramcharan: రామ్ చరణ్ కి కొడుకుపుట్టాలి….మనసులో కోరిక బయట పెట్టిన సుస్మిత!

Ramcharan: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా చిరంజీవి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. చిరంజీవి నెలకొల్పిన మెగా సామ్రాజ్యం నుండి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అలాగే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయ్యాడు.
ఇక అపోలో హాస్పిటల్స్ అధినేత్రి అయిన ఉపాసనని రామ్ చరణ్ ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. ఇక ఇప్పటికి వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తి అయింది.

వివాహం జరిగి పది సంవత్సరాలు గడిచిన కూడా మెగా కుటుంబంలో వారసుడు రాకపోవడంతో అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా వారసుడు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మెగా వారసుడు రాబోతున్నాడు అంటూ అభిమానులకు శుభవార్త తెలియజేశాడు. ప్రస్తుతం ఉపాసన గర్భంతో ఉంది. ఈ క్రమంలో రాంచరణ్ కి అబ్బాయి పుట్టాలని కొందరు కోరుకుంటుంటే లేదు అమ్మాయి పుడుతుందని మరికొందరు అంటున్నారు.

Ramcharan: ఇప్పటికే నలుగురు ఉన్నారు…

ఈ క్రమంలో చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ఇటీవల రామ్ చరణ్ కి పుట్టబోయే పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత చిరంజీవి నటిస్తున్న సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తుంది. ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాకు కూడా పనిచేసింది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుస్మిత రామ్ చరణ్ కి పుట్టబోయే పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో సుస్మిత మాట్లాడుతూ ఇప్పటికే మా ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. రామ్ చరణ్ కి పుట్టబోయేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మాకు సంతోషమే. కానీ రామ్ చరణ్ కి అబ్బాయి పుడితే మాకు చాలా స్పెషల్ ” అంటూ తన తమ్ముడు రామ్ చరణ్ కి అబ్బాయి పుట్టాలని కోరుకుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago