Sitara: టాలివుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు స్టార్ హీరోగా గుర్తింపు పొంది తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక మహేష్ బాబు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలయిన సర్కారు వారి పాట సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్నాడు.
ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉండగా షూటింగ్ లేకపోతే మహేష్ బాబు కుటుంబసభ్యులతో తన సమయాన్ని గడుపుతారు.కుటుంబంతో కలిసి విదేశాలలో వేకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
ఇక ఇటీవల కూడా తన సోదరి భారతి ఘట్టమనేనితో కలిసి హాలీవుడ్ పాటకి డాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సితార తరచూ తన డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. కానీ మొదటిసారిగా మహేష్ బాబు సోదరుడైన రమేష్ బాబు కూతురు భారతి ఘట్టమనేనితో కలిసి సితార మొదటిసారిగా డాన్స్ చేసి వీడియో షేర్ చేసింది.
ఈ వీడియోలో సితార భారతి ఇద్దరు కలిసి ఒక హాలీవుడ్ మ్యూజిక్ కు అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది మహేష్ అభిమానులు సో క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి భారతీ కృష్ణ గారి మరణం తర్వాత సోషల్ మీడియాలో సితారతో కలిసి సందడి చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…