Anchor Akul Balaji : అకుల్ బాలాజీ… ‘పెళ్లి నాటి ప్రమాణలు’ సీరియల్ ద్వారా తెలుగు అభిమానులకు దగ్గర అయ్యాడు. 2012 లో వచ్చిన ఈ సీరియల్ ద్వారా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తెలుగు ‘ఊహలు గుస గుసలాడే’ సీరియల్ చేస్తున్నాడు అకుల్. అంతే కాకుండా డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహారిస్తున్నాడు. అకుల్ బాలాజీ పుట్టినది కడప జిల్లా కు చెందిన రైల్వే కోడూరు అయినప్పటికీ చిన్న తనంలోనే బెంగుళూరులో స్థిరపడటంతో మొదట అక్కడే తన కెరీర్ ను ప్రారంభించాడు.
నా మొదటి సంపాదన బియ్యం బస్తాలు మోయడం ద్వారా వచ్చింది…
కన్నడలో మొదట టీవీ సీరియల్స్ లో నటించడంతో కెరీర్ మొదలుపెట్టాడు అకుల్. తరువాత యాంకర్ గా, రియాలిటీ షోలకు హోస్ట్ గా చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. కన్నడ బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా నిలిచాడు. కొన్ని సినిమాలలో హీరోగా కూడా నటించాడు. సూపర్ స్టార్ కృష్ణ రెండవ భార్య విజయం నిర్మల గారి మేనకోడలిని పెళ్లి చేసుకోవడంతో మహేష్ బాబుకి బంధువు అవుతానని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతే కాదు విజయ నిర్మల గారి దర్శకత్వంలో వచ్చిన అఖరు సినిమా ‘నేరము శిక్ష’ లో కృష్ణ గారితో కలసి నటించారు కూడా.
అయితే కన్నడలో మొదట అవకాశాలు రాకముందు బెంగుళూరులో తన తండ్రి బియ్యం వ్యాపారంలో సహాయం చేసేవాడిని అని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఇంట్లో కొద్దిగా ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగోలేదని అందుకే బియ్యం బస్తా డోర్ డెలివరీ నేనే చేసేవాడిని అని, అప్పుడు వాటిని నేనే మోసుకెల్లే వాడినని చెప్పారు. ఒక బస్తా మోసుకెళ్తే 20 రూపాయలు ఇవ్వాలి అది ఆదా చేసే వాడిని అని చెప్పుకొచ్చారు, అలా అదీ నా మొదటి సంపాదన అని చెప్పారు అకుల్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…