K S Prasad : గత కొద్ది రోజులుగా ఏపీ లో నలుగుతున్న వివాదం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చడం. ఇక ఈ ఇష్యూ మీద నందమూరి కుటుంబ సభ్యులు మాట్లాడటం, వారి మీద ఏపీ మంత్రులను సటైర్లు అన్ని చూస్తూనే ఉన్నాం. బాలకృష్ణ విశ్వాసం లేని కుక్కలు అంటూ ఘాటుగా ట్వీట్ చేయడంతో ఇటు వైసీపీ మంత్రులు కూడా ఘాటుగా మాట్లాడారు. ఫ్లూటు బాబు ముందు ఊదు జగన్ ముందు కాదు అంటూ మాట్లాడారు. ఇక దీనిపై పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ మాట్లాడుతూ నందమూరి కుటుంబం మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తరు.
సింహాలు, పులులు కాదు పిల్లులు…
నందమూరి కుటుంబం మొదటి నుండి ఇంతే వారి మీద ఒక విమర్శ వచ్చినా పెద్దగా స్పందించరు. సినిమాల్లో అయితే వారి పౌరుషం అన్నీ చూపిస్తారు కానీ నిజజీవితంలో పిల్లుల్లా బతుకుతున్నారు. బయటికి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. వాళ్ళ కంటే టీడీపీ కార్యకర్తలే ఎక్కువ ఆవేశ పడ్డారు ఎన్టీఆర్ పేరు మార్పు విషయంలో. ఇక లక్ష్మి పార్వతి వంటి మనిషి చేతిలో నుండి పార్టీ కాపాడిన వ్యక్తో మీద వెన్నుపోటు అనే ముద్ర వేసినా కూడా వీళ్ళు పెద్దగా పట్టించుకోరు.
ఆనాడు ఎన్టీఆర్ మరణించినపుడు ముందుకు వచ్చి పార్టీ ని కాపాడుకోలేక పోయారు. సినిమాల్లో రంగు వేసుకుని నటించడం మాత్రమే తెలుసు. ఇక ఆ బాలకృష్ణ కు ఒకరు రాసిచ్చి యాక్షన్ అంటే కానీ మాటలు రావు. తండ్రి పేరు మారుస్తున్నారంటే ట్వీట్ చేసాడు ఇంకేం అనాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ తాత దేవుడు అనడమే కానీ ఎన్టీఆర్ ను వైస్సార్ తో పోలుస్తాడు. ఇక జగన్ కి వీళ్ళ వైఖరి బాగా తెలుసు అందుకే అలా ఆడుకుంటున్నాడు. జగన్ కొత్తగా మెడికల్ కాలేజీలు కొన్ని తేవాలనుకుంటున్నాడు, వాటికి ఎన్టీఆర్ యూనివర్సిటీ అనే పేరు ఉండటం ఇష్టం లేదు, రాజకీయంగా అది మైలేజ్ ఇవ్వదు అందుకే ముందస్తు గా పేరు మార్చాడు అంటూ కే ఎస్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…