Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేదు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె ప్రస్తుతం వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె వృత్తిపరమైన విషయం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే అనసూయ సుశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈమె ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఎన్సిసి క్యాంపులో సుశాంక్ పరిచయం ఏర్పడటంతో అప్పటినుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారు.
ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ రహస్యగా ప్రేమ ప్రయాణం కొనసాగించారు అయితే అనసూయ తండ్రి తనకోసం ఒక పైలెట్ సంబంధం తీసుకువచ్చారట మంచి ఉద్యోగం మంచి ఆస్తిపరుడు తనకు పెళ్లి చేయాలని భావించారు. అయితే అనసూయ మాత్రం తన ప్రేమ విషయాన్ని తన తల్లి ద్వారా తన తండ్రికి చేరవేయడంతో తన తండ్రి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా తాను తెచ్చిన సంబంధం చేసుకుంటే సరేనని లేదంటే ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అంటూ తన లగేజ్ మొత్తం బయటకు విసిరేసారట. దీంతో తన లగేజ్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి అనసూయ దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు తన తండ్రి అంగీకారం కోసం ఎదురు చూశారట. తన తండ్రి తమ పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో సుశాంక్ తో మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామంటూ ఈమె మాట్లాడారట కానీ శశాంక్ మాత్రం అలా వెళ్లి పెళ్లి చేసుకుంటే మనకు ఎలాంటి గౌరవం ఉండదు ఆయన మనసు తప్పకుండా మారుతుందని ఎదురు చూశారట.
9 ఏళ్ల నిరీక్షణ..
ఇలా అనసూయ ఎంతకీ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చివరికి తన తండ్రి ఒక అడుగు వెనక్కి వేసి తన ప్రియుడుతోనే తనకు పెళ్లి చేశారని అయితే ఇష్టంగా మాత్రం చేయలేదని కానీ అనసూయకు పిల్లలు పుట్టిన తర్వాత తనని మనస్పూర్తిగా అంగీకరించారని తెలుస్తుంది. ఇలా తన పెళ్లిలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయని తన ప్రేమ గెలిపించుకోవడం కోసం ఈమె ఎన్నో ఏళ్ళు ఎదురు చూశాను అంటూ గతంలో కూడా తెలిపిన సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…