Anasuya Bhardwaj: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు ఈమె యాంకర్ గా కెరియర్ ప్రారంభించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ అనంతరం వెండితెరపై వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా బిజీ అయ్యారు.
ఈ విధంగా అనసూయకు వరుసగా వెండితెర సినిమా అవకాశాలు రావడంతో ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు ప్రస్తుతం సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నటువంటి ఈమె మరోవైపు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కూడా వెళ్తూ భారీగానే సంపాదిస్తున్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా ఈమె నిండుగా చీర కట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ ఫోటోల పై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఆనందంగా జీవించు..
చీర కట్టులో చాలా నిండుగా ఎంతో అందంగా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఈ ఫోటోలలో చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉన్నటువంటి అనసూయ ఈ ఫోటోలను షేర్ చేస్తూ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆనందంగా జీవించడం మర్చిపోవద్దు అంటూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక అనసూయ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటూనే ఉంటారు అయితే వాటిని పక్కన పెట్టి ఈమె తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…