జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ అటు బుల్లి తెర మరియు ఇటు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో కూడా ఈమెకు ఒక హీరోయిన్ లను మించిన క్రేజ్ ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ప్రస్తుతం ఈవిడగారు చేస్తున్న సినిమాలు మరియు షోల లిస్ట్ చెప్పాలంటే చాలా వుంది.
ఇంత క్రేజ్ ఉన్న ఈ రంగమ్మత్తకి పొలిటికల్ ఆఫర్లు కూడా వస్తున్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఈమధ్యనే అధికారంలో ఉన్న పార్టీ నుండి ఈమెకు ఆహ్వానం కూడా అందిందట. కీలక పార్టీ పదవితో పాటు రాబోయే రోజుల్లో మంచి సీటు కూడా ఇస్తామంటూ అధికార పార్టీ వారు హామీ ఇచ్చి మరీ ఆహ్వానించారట. రాజకీయాలు అంటే ఆసక్తి ఉన్న అనసూయకు ప్రస్తుతానికి రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వాలనే ఆశ మనసులో వున్నా కెరీర్ పరంగా డల్ అయినప్పుడు రాజకీయాల గురించి ఆలోచించడం బెటర్ అంటూ ఈ అమ్మడికి శ్రేయోభిలాషులు సూచించారట. అందుకే ఈమె రాజకీయాల విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదంట. ఇదే విషయాన్ని ఫ్యాన్స్ అడిగితే భవిష్యత్తులో చూద్దాం అంటూ తప్పించుకుంది. ఈ లెక్కన రాబోయే రోజుల్లో అనసూయను రాజకీయ రంగస్థలంపై చూడటం ఖాయం అన్నమాట. ఎంతో మంది బుల్లి తెర మరియు వెండి తెర పైకి వచ్చి ఓ వెలుగు వెలిగాక రాజకీయాలు చేసి సక్సెస్ అయ్యారు.
అనసూయ కూడా అదే దారిలో నడుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. గతంలో అనసూయ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కినటువంటి “యాత్ర” చిత్రంలో ప్రాధాన్యత ఉన్న ప్రముఖ రాజకీయ నాయకుడి భార్య పాత్ర పోషించింది. అయితే నాటి నుంచే ఈ రాజకీయ చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మన రంగమ్మత్థ టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నటువంటి ఫైటర్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప చిత్రంలో కూడా నటించడానికి ఓకె చెప్పేసిందని తాజా సమాచారం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…