’నీతోడుకావాలి’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది అందాల తార ఛార్మీ. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా నటించిన ‘నీకే మనసిచ్చాను’ చిత్రంలో కూడా నటించింది. అయినప్పటికి ఈ భామకు అంతగా ఆఫర్స్ రాలేదు. కానీ కృష్ణవంశీ డైరెక్షన్లో చేసిన ‘శ్రీ ఆంజనేయం’ చిత్రంలో ఓ రేంజ్ లో స్కిన్ షో చేసి అందరి మనసు ఆకట్టుకుంది. ఆ సినిమా ఆశించినంత హిట్ కాకపోయినా.. ఛార్మీకి మాత్రం మంచి పేరు వచ్చింది. అందుకే ఆ తర్వాత వరసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. తక్కువ సమయంలోనే ప్రభాస్,రవితేజ, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ చేసింది. ‘మంత్ర’ ‘మంగళ’ ‘జ్యోతి లక్ష్మీ’ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది.
తర్వాత ఎందుకో నటనకు స్వస్తి చెప్పి.. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు సహ నిర్మాతగా బాధ్యతలు తీసుకుంది. అయితే పూరి జగన్నాథ్ తో ఛార్మీ డేటింగ్ లో ఉందనే సంచలన వార్తలు కూడా మీడియాలో హల్ చల్ చేశాయి. వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండడం చూసి ఇది నిజంగా డేటింగే అని అనుకున్నారు. అయితే ఈ వార్తలను ఛార్మీ ఖండిచింది. ’పూరి తనకు మంచి ఫ్రెండ్’ అని తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఛార్మీ పెళ్ళి చేసుకోవడానికి ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ‘లాక్ డౌన్ కారణంగానే పెళ్ళి వాయిదా పడిందని లేకుంటే.. ఈపాటికి ఛార్మీ పెళ్ళైపోయేదని’ ఇన్సైడ్ టాక్. మరి ఈ గాసిప్ లో నిజానిజాలేమిటో తెలియాల్సి ఉంది. మరి ఈ గాసిప్ కోసం లాక్ డౌన్ తర్వాతైనా ఛార్మీ ఎలా స్పందిస్తుందో చూద్దాం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…