యాంకర్ అనసూయ ఇంట విషాద ఘటన చోటుచేసుకుంది. యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ తండ్రి మధుసూదన రావు నేడు మృతి చెందడంతో ఆమె ఇంట విషాదం నెలకొంది. అయితే ఈయన మరణానికి కారణం అతని అనారోగ్య సమస్య అని తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి అనసూయ తండ్రి మధుసూదన రావు క్యాన్సర్ తో బాధపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అనసూయ తన తండ్రి మరణవార్త తెలియగానే కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ క్రమంలో తన షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన ఈమె తార్నాక బయలుదేరారు. ఈ విషయం తెలిసిన పలువురు విచారం వ్యక్తం చేశారు.
గతంలో అనసూయ తన ప్రేమ గురించి చెబుతూ తనకి భరద్వాజ్ ప్రేమ వివాహానికి తన తండ్రి అడ్డు చెప్పారని ఈ క్రమంలోనే తన తల్లిదండ్రుల అనుమతి కోసం ఐదు సంవత్సరాల పాటు నిరీక్షించారని ఈమె గతంలో తన తండ్రి గురించి తెలిపారు.ఇలా తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న అనసూయ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్నారు.
అనారోగ్యంతో మృతి చెందిన అనసూయ తండ్రి మధుసూదన రావు గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర వహించినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో అనసూయ తన తండ్రి భౌతికకాయాన్ని సందర్శించనున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…