మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం తన భర్త చైతన్యతో కలిసి బార్సిలోనాలో వెకేషన్‌లో ఉంది. పెళ్లై ఏడాది అవబోతోన్న సందర్భంగా ఇలా వెకేషన్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత నిహారిక ఓ సక్సెస్ ను అందుకుంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యహరించి.. మంచి విజయాన్ని అందుకున్నారు. దీనిపై మెగస్టార్ కూడా స్పందిస్తూ.. కంగ్రాట్స్ చెప్పిన విషయం తెలిసిందే.
అలా ఈ చిన్న ఫ్యామిలీ స్టోర్ పెద్ద హిట్ అయింది. ఆ ఆనందంలో తన భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి ఫారెన్ టూర్‌కు వెళ్లింది నిహారిక. అక్కడ కూడా నిహారిక సోషల్ మీడియా అప్డేట్స్ చూస్తూ ఫోన్ లోనే మొహం పెట్టి మునిగిపోవటంపై భర్త చైతన్య సెటైర్ వేశాడు. నిహారిక ఫోన్ చూస్తూ కూర్చున్న ఓ పిక్‌ను పోస్ట్ చేశాడు. నిహారిక ఎప్పుడూ ఫోన్‌లోనే బిజీగా ఉంటుందని, ఫోటోలను షేర్ చేశాడు.
తర్వాత మళ్లీ కొంచెం సమయం ఆగాడు.. తర్వాత మళ్లీ ఆమె అదే పనిలో ఉంది. ఆ ఫోటోను కూడా అతడు షేర్ చేస్తూ.. ఎప్పుడూ అదే పని అంటూ.. ప్రేక్షకులకు ఫిర్యాదు చేశాడు. మొత్తానికి వీళ్లిద్దరు వెకేషన్లో మస్తు ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక నిహారిక కెరీర్ ఆరంభంలో యాంకర్‌గా.. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలో సత్తా చాటింది. తర్వాత హీరోయిన్‌గా మాత్రం సక్సెస్‌ను అందుకోలేకపోయింది.
ఈ క్రమంలోనే నాగశౌర్య నటించిన ‘ఒక మనసు’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ వంటి చిత్రాల్లోనూ లీడ్ రోల్ చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని ఇవ్వలేదు. తర్వాత మళ్లీ ఇన్ని రోజులకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సరిస్ తీసి హిట్ కొట్టేసింది. ఆమె సినిమాల్లో నటించనని.. అది తన భర్తకు ఇష్టం లేదని చాలాసార్లు చెప్పిన విషయం తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…