Movie News

Anchor Anasuya: అత్తా పితా అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. కోడలైన సరే అలా పిలవకూడదు: అనసూయ

Anchor Anasuya:బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ వరుస వెండితెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ కావటం వల్ల ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి కూడా దూరమయ్యారు. ఈ విధంగా అనసూయ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే గత కొద్దిరోజులుగా అనసూయను ఆంటీ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అనసూయ లైగర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఈమె పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఎత్తున వివాదానికి దారి తీసింది.ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఇక ఈ విషయంపై నటుడు బ్రహ్మాజీ సైతం తనదైన శైలిలో కౌంటర్ వేయడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగినప్పటికీ తాజాగా మరోసారి ఈ ఆంటీ అనే వివాదాన్ని అనసూయ తెరపైకి తీసుకు వచ్చినట్టు తెలుస్తోంది. అనసూయ తాజాగా సుమ వ్యవహరిస్తున్నటువంటి క్రేజీ కిచెన్ అనే వంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనసూయ మాట్లాడుతూ తనకు వంట రాదని చాలామంది అనుకుంటారు కానీ తాను ఎలా వంట చేస్తానో ఈ కార్యక్రమం ద్వారా నిరూపిస్తానని చెప్పారు.

Anchor Anasuya: అత్త అని పిలవడం ఏమాత్రం ఇష్టం ఉండదు..

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఆంటీ అనే విషయం గురించి మరోసారి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా అనసూయ ఈ విషయంపై మాట్లాడుతూ నన్ను ఎవరైనా అత్తా పిత్తా అంటే అసలు ఊరుకోను.అలా పిలవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు చివరికి నా కోడలైనా సరే నన్ను ఆంటీ అని పిలవకూడదు కేవలం అను అని పిలిస్తే చాలు అంటూ కామెంట్ చేయడంతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.మరి ఈ విషయంపై సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ వస్తాయో ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago