Badrinath Lady Villain : అల్లు అర్జున్, తమన్నా ప్రధాన పాత్రలలో వచ్చిన ‘బద్రీనాథ్’ సినిమాలో అశ్విని కల్సేకర్ విలన్ పాత్రలో అదరగొట్టిన సంగతి తెలిదిందే. అశ్విని కల్సేకర్ తెలుగులో కన్నా హిందీ సినిమాలలో ఎక్కువగా నటించారు. మరాఠి టెలివిజన్, హిందీ సీరియల్స్ లో ఎక్కువగా నటించారు. బద్రీనాథ్ సినిమా ఈమెకు తెలుగులో మొదటి సినిమా కాగా, తరువాత నిప్పు, మెహబూబ వంటి సినిమాలలో కూడా నటించింది. హిందీ సినిమాలలో ఎక్కువగా నటించిన అశ్విని, రోహిత్ శెట్టి, అర్జీవీ ల సినిమాలలో ఎక్కువగా కనిపించారు. ప్రస్తుతం జీ 5, హాట్ స్టార్ వెబ్ సిరీస్ లలో ఎక్కువగా నటిస్తున్నారు. అయితే అశ్విని కల్సేకర్ భర్త ఎవరో చాలా మందికి తెలియదు.
గోల్మాల్ సినిమా సమయంలో చిగురించిన ప్రేమ…
అశ్విని కల్సేకర్ భర్త ఎవరో కాదు ప్రముఖ సినీ నటుడు మురళి శర్మ. ఈయన తెలుగు తో పాటు ఇతర భాషా చిత్రాలలో కూడా ఎక్కువగా నటించారు. బాలీవుడ్ లో మొదట కెరీర్ ను ప్రారంభించిన మురళి శర్మ తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అతిథి’ సినిమాలో నటించారు. తరువాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు ఆయనకు క్యూ కట్టాయి. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ రోల్స్ ఇలా ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే ఆయనకు ‘అలా వైకుంఠపురములో’ సినిమా నటుడుగా మంచి గుర్తింపు ఇచ్చింది అనే చెప్పుకోవాలి.
బాలీవుడ్ లో రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన గోల్మాల్ సినిమాలో కలసి నటించిన వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అశ్విని కల్సేకర్ మొదట 1998 లో నితీష్ పాండే ని వివాహం చేసుకున్నారు. అయితే 2002 లో విడాకులు తీసుకున్న అశ్విని తరువాత మురళి శర్మని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ భార్య భర్తలు అని చాలా మందికి తెలియక పోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…