తెలుగు బుల్లితెర ఫై సందడి చేసే స్టార్ యాంకర్ లలో జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. యాంకర్‌గా తన టాలెంట్‌తో ఆకట్టుకుంటోన్న అనసూయ తన అందమైన ఫొటోషూట్‌లతో నెటిజన్ లను మాయ చేస్తోంది.జబర్దస్త్ వల్ల ఫేమ్ అయిన యాంకర్ అనసూయ, బుల్లితెర మీదే కాదు అటు వెండి తెర మీద కూడా అవకాశాలు సంపాదిస్తూ ముందుకి దూసుకెళ్తుంది.
ప్రస్తుతం అనసూయ తెలుగు బుల్లి తెర పై తనకంటూ మాస్ ఫాలోయింగ్ ని సంపాదించుంది. అలాగే హాట్ బ్యూటీగా కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పై వచ్చే రూమర్స్ కు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అలాగే తన అభిమానులతో తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా అనసూయ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ను ఒక డౌట్ అడిగింది.. డియర్ కేటీఆర్ సార్..అసలు లాక్‌డౌన్ ఎందుకు వచ్చిందో .. ఆపై అన్ లాక్ కూడా ఎందుకు వచ్చిందో మనందరికీ తెలిసిందే. అయితే మనందరికీ వ్యాక్సిన్ తీసుకున్నాము అన్న భరోసా ఉండవచ్చు. మరి వ్యాక్సిన్ కు దూరంగా ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి సార్ అంటూ ట్వీట్ చేసింది.
అలాగే పాఠశాలలు తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయి? అంటూ తనకు వచ్చిన డౌట్ ను కేటీఆర్ కు పోస్ట్ చేసింది అనసూయ. పిల్లలకు స్కూల్ లో ఉన్నప్పుడు వారికి ఏమైనా జరిగితే మాకు బాధ్యత లేదని పాఠశాల యాజమాన్యం సంతకం చేయించుకుంటున్నాయని, ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి సార్.. మీరు ఎప్పటిలాగే మాకు సరైన మార్గనిర్దేశం చేస్తారనే ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ మరొక ట్వీట్ చేసింది అనసూయ.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…