బుల్లితెర ఫై ప్రసారమయ్యే జబర్ధస్త్ ప్రోగ్రామ్ చూసేవాళ్లకు కమెడియన్ హైపర్ ఆది గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.జబర్ధస్త్ షోను కొంతమంది కేవలం హైపర్ ఆది వేసే పంచ్‌ల స్కిట్ చూస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ఎందుకంటే హైపర్ ఆది వేసే పంచులకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇతని హంగామా బుల్లితెరపై ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఒకవైపు బుల్లితెరపై కమెడియన్ గా చేస్తూనే, అప్పుడప్పుడు వెండితెర పై నటిస్తూ ఉంటాడు. మాటమాటకు పంచులు వేస్తూ చుట్టూ ఉన్న వాళ్ళను పరేషాన్ చేయడం హైపర్ ఆది నైజం అని చెప్పవచ్చు. ఒకవైపు జబర్దస్త్ లో కమెడియన్ గా చేస్తూనే మరొకవైపు ఢీ షో లో యాంకర్ గా, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఇలా పలు ఈవెంట్లలో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో హైపర్ ఆది రెమ్యూనరేషన్ ఎంత? ఒక్కొక్క స్కిట్ కు ఎంత తీసుకుంటున్నాడు? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. హైపర్ ఆది రేంజ్ కి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ ఉంటుంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈవెంట్ ను బట్టి ఆది పారితోషికాన్ని డిమాండ్ చేస్తాడు అంటూ సమాచారం.
జబర్దస్త్ లో ఒక స్కిట్ కి దాదాపుగా లక్ష వరకు తీసుకుంటాడు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇలా జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా పలు షో లలో నటితో బాగానే వెనకేసుకు నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాళ్ళ సొంత ఊర్లో 16 ఎకరాలు ఉన్న హైపర్ ఆది తాజాగా హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ తీసుకున్నట్లుగా సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…