Categories: FeaturedMovie News

అలాంటి అమ్మాయిలే క్యాస్టింగ్ కౌచ్ కి కారణం.. సంచలన కామెంట్స్ చేసిన అనసూయ..!!

అనసూయ భరద్వాజ్.. గల గల నవ్వే సెలయేరులా అటు బుల్లితెర, ఇటు వెండితెర అనే వ్యత్యాసం లేకుండా ఎక్కడ ఏ ఛాన్స్ వచ్చినా అల్లుకు పోతుంటుంది. ‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షోలో బిజీగా వున్నా సినిమాల్లోనూ నటిస్తూ బిజీబిజీగా వుంటోంది అనసూయ. ఇటు జబర్దస్త్ తో పాటు సినిమా ఆడియో ఫంక్షన్లలోనూ తళుక్కున మెరుస్తూ వుంటుంది, అవన్నీ చాలవన్నట్టుగా వెరైటీ డ్రెస్సులతో ఫోటో షూట్లు చేస్తూ తన అంద చందాలతో కుర్రకారుకి కనువిందు చేస్తుంటుంది.

ప్రస్తుతం టాప్ యాంకర్ లలో ఒకరైన అనసూయ తాజాగా కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. బుల్లితెర యాంకర్ గా పరిచయమైన అనసూయ ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్త పాత్రలో అదరగొట్టేసిన తర్వాత వరుసగా సినిమా ఆఫర్లను దక్కించుకుంది. ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో హాట్ యాంకర్ అనసూయ టాలీవుడ్ లోని క్యాస్టింగ్ కౌచ్ పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్లే చేసింది. “తనకు తానుగా అవకాశలకోసం ఎప్పుడూ వెళ్లలేదని కేవలం వచ్చిన అవకాశాలను మాత్రమే ఉపయోగించుకున్నానని, MBA చదివిన తాను జాబ్ చేస్తూ యాంకరింగ్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టానని తెలియజేసింది. ‘టాలీవుడ్ లో మీకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురవ్వలేదా.?’ అని అడిగినప్పుడు.

అనసూయ ‘అది మనం స్పందించే విధానంపై ఆధారపడి ఉంటుంది. సినీ రంగంలో మీటూ, క్యాస్టింగ్ కౌచ్ లాంటి వ్యవహారాలు ఉండొచ్చు కానీ అది అమ్మాయి నేచర్ మీదే ఆధారపడి ఉంటుంది. ఓ సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఎవరైనా లైంగికంగా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తే.. ఆ సినిమా ఛాన్స్ రావాలంటే ఇతను ఇలా అడుగుతున్నాడు.. ఇది కాకపోతే మరో ఛాన్స్ వస్తుందనే ఆత్మ విశ్వాసంతో డ్రాప్ అయిపోవచ్చు . కానీ., అలా డ్రాప్ కాని ఆడవాళ్ళే ఈ క్యాస్టింగ్ కౌచ్‌ కి బలై పోతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన అనసూయ ఇంకా ఆ ఇంటర్వ్యూ కొనసాగింపుగా మాట్లాడుతూ.. ” టాలీవుడ్ లోని లేడీ ఆర్టిస్ట్ లందరికీ నేను చెప్పేదొక్కటే.. మీరు మీ టాలెంట్‌ ని నమ్ముకోండి. బయట కాంపిటేషన్ లేదని చెప్పడం లేదు. నేను చేసే క్యారెక్టర్స్‌ నే గమనిస్తే నాకంటే బాగా చేసే మరో పదిమంది ఆర్టిస్ట్ లు ఉండొచ్చు.. కానీ, మీరు మీ టాలెంట్‌ని మాత్రమే నమ్ముకోండి.

ఫేవరేటిజం అనే దానికి నేనూ బలయ్యాను. బట్ ఎప్పుడూ బయటకు చెప్పలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. రెండేళ్ల క్రితం ఓ గ్రూప్ ఫేవరేటిజం వల్ల నేను కూడా ఎన్నో ఛాన్స్ లు మిస్సయ్యాను. కానీ., నేను నా టాలెంట్‌ నే నమ్ముకొని ఈ స్థాయికి చేరుకున్నాను. ఫలానా క్యారెక్టర్ అనసూయ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనేంతలా కష్టపడాలి. లైఫ్‌ లో ఆ గోల్ పెట్టుకుంటే కాస్టింగ్ కౌచ్‌ కాదు కదా.. క్యాస్టింగ్ పిల్లో కూడా మన లైఫ్ లోకి రాదు” అంటూ స్ట్రాంగ్ గా చెప్పి ఇంటర్వ్యూను ముగించింది మన రంగమ్మత్త.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago