తెలుగు చలన చిత్ర సినిమా పరిధి ఒక్క బడ్జెట్లోనే కాకుండా అన్ని విషయాలలోనూ దాటి పోయింది. హద్దులు చెరిపేసింది. ఒకప్పుడు ముద్దు సీన్స్ అంటే చెట్టు ఊగడమో.. లేదంటే చేతులు అడ్డుపెట్టడమో చూపించి సింబాలిక్ గా ముద్దు అని చెప్పేవారు. కానీ ఇప్పుడు సినిమా పరిధి దాటిపోవడంతో పాటు సినీ ప్రేక్షకుల టెస్ట్ కూడా మారడంతో దానికి తగినట్టుగా సినిమాలు తీయడానికి సిద్ధమౌతున్నారు టాలీవుడ్ దర్శకులు. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో లిప్ లాక్ ల హవా కొనసాగుతోంది. లిప్ లాక్ కావాలంటే అది చూపించాల్సిందే.!
అప్పట్లో హాలీవుడ్ సినిమాల్లో ముద్దు సీన్లు వస్తుంటే.. అందరూ సిగ్గు పడుతూ ఈ సీన్లను చూస్తుండేవారు. కానీ ఇప్పడు ప్రతీ సినిమాలో ముద్దు సీన్లు ఖచ్చితంగా వుంటున్నాయి. ముక్క లేనిదే ముద్ద దిగదన్నట్లుగా ముద్దు సీన్ లేనిదే సినిమా ఆడదు అనే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ లిప్ లాక్ సీన్లలో మరో ట్విస్ట్ ఏమిటంటే.. హీరో, హీరోయిన్ల మధ్య లిప్ లాక్ వ్యవహారాలు సర్వ సాధారణమైపోయాయనుకున్నారేమో టాలీవుడ్ భామలు కూడా లిప్ లాక్ లకు సిద్ధమైపోతూ ఓ సంచలనానికి తెర లేపారు. వాళ్ళు మరెవరో కాదు.. ప్రముఖ Tv యాంకర్ ఝాన్సీ, టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.
వివరాల్లోకి వెళ్తే.. నటిగా తన సినీ ప్రస్ధానాన్ని మొదలు పెట్టి.. యాంకర్ గా మంచి గుర్తింపును సంపాధించుకుంది ఝాన్సీ. ఈ నేపథ్యంలో యాంకరింగ్ చేస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటించింది. 1994లో వచ్చిన ‘ఎగిరే పావురమా’ చిత్రం ద్వారా ఝాన్సీ వెండితెరకు పరిచయమైంది. అప్పటికే వయసు కాస్త మీద పడటంతో సపోర్టింగ్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా, నెగెటివ్ షేడ్స్ ఉన్న మహిళగా చాలా మంచి పాత్రలనే ఎంచుకుని నటించింది. సినిమాల పరంగా, Tv షోల పరంగా బిజీ బిజీగా ఉన్న టైంలో ఝాన్సీ.. ప్రముఖ హాస్య నటుడు జోగీ నాయుడును ప్రేమించి పెళ్ళి చేసుకుంది. వీళ్లకు ఒక పాప కూడా పుట్టింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్ఫర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి ఝాన్సీ ఒంటరిగా ఉంటుంది.
ఇక అసలు విషయానికి వస్తే.. ప్రముఖ సీనియర్ యాంకర్ ఝాన్సీ.. సింగర్ సునీతతో కలిసి ‘అలీతో సరదాగా’ అనే బుల్లితెర షోలో అతిధిగా వచ్చింది. ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్ వ్యవహరిస్తున్న ఈ షోలో వీళ్ళిద్దరూకొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ షోలో భాగంగా ‘మన్మథుడు 2’ చిత్రంలోని తన లిప్‌లాక్ సీన్ పై ఝాన్సీ మొదటిసారిగా స్పందించింది. ఆ సీన్ గురించి ఆమె మాట్లాడుతూ..
”సినిమాలో ఆ సీన్ అవసరం కాబట్టే రాహుల్ ఆ సీన్ నాతో చేయించాడు. హీరోయిన్ కిస్ చేయడం వల్లే… భర్త మీద కోరిక కలిగి నా పాత్ర అతడితో వెళ్లిపోతుంది. అంత బోల్డ్ గా.. ఆడవాళ్ల మనసులో దాగివుండే కోరికల గురించి రాహుల్ ఎంతో ధైర్యంగా చూపించాడు. అందుకు అందరూ అయనను మెచ్చుకోవాలి. అంతేకానీ తప్పుగా చూడకూడదు’ అంటూ క్లారిటీ ఇచ్చింది. కానీ., తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే మన దేశంలో పాశ్చాత్య సంస్కృతిని ఆవిష్కరించే విధంగా తెలుగు సినిమాలలో లెస్బియన్ సీన్స్ పెడితే ప్రేక్షకుల నుండి విమర్శలే తప్ప ప్రశంసలు రావన్న సంగతి పాపం ఈ సీనియర్ నటికి తెలియదేమో.!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…