సినిమావాళ్ళంటేనే చాలా మందికి చదువుపై శ్రద్ధ లేనివాళ్ళే సినిమా రంగంలోకి వస్తారనే చిన్న అపోహ ఒకటి ఉండి పోయింది. అయితే సినిమా తారలలో చాలామంది హీరోయిన్స్ మంచి మంచి చదువులే చదువుకుని నటనపై ఉన్న ఆసక్తితో సినీరంగంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.
అందులోనూ ప్రస్తుతతరం కధానాయికలైతే చదువు తర్వాతే ఏదైనా.. అనే కాన్ఫెప్ట్ లో మంచిగా చదువుకుని ఆ తర్వాత వాళ్ళ యొక్క యాంబిషన్స్ ని పూర్తిచేసుకుంటున్నారు. ఆవిధంగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న మన కధానాయికలు ఎవరెవరు ఏమి చదువుకున్నారో మీరే చదివి తెలుసుకోండి..
నయనతార నవంబరు 18, 1984లో బెంగళూరులో జన్మించింది. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఒమన్ కురియన్. మలయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన నయన్ విద్యాభ్యాసం వివిధ రాష్ట్రాల్లో జరిగింది. ఎక్కువగా మాత్రం నార్త్‌లో జరిగింది. నయన్ సినిమా కెరీర్ ప్రారంభించకముందు ఆమె మార్ధోమా కాలేజ్‌లో బీ.ఏ. పూర్తి చేసారు.
మంగుళూరులో జన్మించిన అనుష్క బెంగళూరులో విద్యాభ్యాసం చేసింది. కార్మెల్ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసింది. BCA చదివినా.. చిన్నతనం నుంచి యోగాపై ఆసక్తితో అనుష్క యోగ శిక్షకురాలిగా పనిచేసింది. యోగాలో శిక్షణ పొంది శిక్షకురాలిగా పనిచేస్తున్న టైంలో అనుకోకుండా సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. 2005లో సూపర్ సినిమాతో అవకాశం దక్కించుకొని మంచి విజయం అందుకుంది అనుష్క.
సమంత చిన్నప్పటి నుండే చాలా చురుకుగా ఉండేది. ఆమె సెయింట్ స్టీవెన్స్ మెట్రిక్యూలేషన్ స్కూలు, చెన్నై హోలీ ఏంజెల్స్, ఆంగ్లో ఇండియన్ సెకండరీ స్కూళ్లలో చదువుకుంది. ఆ తర్వాత చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీ నుండి డిగ్రీ పట్టా పొందింది. చదువుకునే టైంలోనే ఆమె డ్యాన్స్ లు చేయడం, అందరితో సరదాగా కలిసి ఉండటం చేసేది. సమంత డిగ్రీ చదువుకునే టైంలోనే చెన్నైలోని నాయుడు హాల్లో మోడల్ గా పని చేసింది. అంతకుముందు ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు చిన్న చిన్న ఉద్యోగాలను కూడా చేసింది. సరిగ్గా ఆ టైంలో ఆమెకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ రవి వర్మన్ మొదటిసారిగా సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. అప్పుడే ఈ అందాల భామ సినీ రంగంలోకి అడుగు పెట్టింది.
మిల్కీ బ్యూటీ తమన్నా ముంబయిలో మానెక్‌జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్‌లో చదివిన తమన్నా ఆ తర్వాత ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా పొందింది. 2005 లో ఓ హిందీ చిత్రం ద్వారా నటిగా పరిచయమైంది. ‘శ్రీ’ చిత్రంలో మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా నటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా.
త్రిష చెన్నై లోని చర్చ్ పార్క్ దగ్గర ఉన్న సైకిక్ హాట్ పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత చెన్నైలోని మహిళా కళాశాలలో బీబీఏ పూర్తి చేసింది. 1999లో వచ్చిన ‘జోడీ’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించిన త్రిష ‘ఆరు’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
కాజల్ అగర్వాల్ కేవలం అద్భుతమైన నటి మాత్రమే కాదు అద్భుతమైన విద్యార్ధిని కూడా కాజల్ జైహింద్ కాలేజ్ లో ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ పూర్తి చేసింది. ఆ తర్వాత కేఏసీ కళాశాలలో మాస్ మీడియాలో మార్కెటింగ్ విభాగంలో పట్టా కూడా పొందింది కాజల్. ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది
కన్నడ సినిమా ‘గిల్లి’తో పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే శ్రమిస్తుంది. రకుల్ ఢిల్లీలోని ఆర్ మీ పబ్లిక్ స్కూల్ లో చదివింది. ఆ తర్వాత జీసస్ & మేరీ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో గణిత విద్యను అభ్యసించింది. ‘కెరటం’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది రకుల్.
యూనివర్శిల్ నటుడు కమల్ హాసన్ కూతురుగా వెండి తెరకు పరిచయమైన శ్రుతీహాసన్ తనదైన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. చెన్నైలోని లేడీ ఆండాల్ వెంకట సుబ్బారావు స్కూల్ లో చదివింది శృతి. ఆ తర్వాత ముంబయిలోని ఓ ప్రముఖ కాలేజీలో సైకాలజీ డిగ్రీ పూర్తి చేసింది. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రుతీహాసన్ కేవలం నటి మాత్రమే కాదు.. ఆమె ఒక గాయని కూడా.!
కర్ణాటకలో MMK కాలేజీలో M.Com చదివింది పూజా హెగ్డే. పూజ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు చదువుపై దృష్టి సారిస్తున్నది. త్వరలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆమె విదేశాలకు పయనమవుతున్నట్లు తెలిసింది. తాజాగా ప్రభాస్ తో నటిస్తున్న చిత్రం తర్వాత సినిమాలకు స్వల్ప విరామం ప్రకటించి చదువుపై దృష్టి సారించాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆంథ్రోపాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయనున్నట్లు సమాచారం. త్వరలో పూజా హెగ్డే కొన్నాళ్ళ పాటు బుక్స్‌తో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఆమె ఫ్రెండ్స్ చెబుతున్నారు.
కేవలం 22 ఏళ్లకే తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ కొట్టేసిన రష్మిక 1996 ఏప్రియల్ 5న కర్ణాటకలోని విరాజ్ పేటలో మదన్ మందాన, సుమనా మదన దంపతులకు పుట్టింది. ఈమెకు ఓ సోదరుడు, ఓ చెల్లి ఉన్నారు. సోదరుడు ధర్మ వైజాగ్ సన్ ఇనిస్టిట్యూట్ లో ఈజీ బీఎస్సీ చదువుతుండగా, చెల్లెలు షిమా 5వ తరగతి చదువుతోంది. రష్మిక కూర్ పబ్లిక్ స్కూల్ లో ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తి చేసి, మైసూర్ లో ప్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తి చేసిన రష్మిక మందన్నా సైకాలజీలో డిగ్రీ చేసింది. ఎం ఎస్ రామయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇంగ్లీషు లిటరేచర్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. కాలేజ్ డేస్ లోనే 1,2 యాడ్స్ లో నటించిన ఈమె తన బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టితో కల్సి ‘కిరికిపార్టి’ చిత్రంతో తొలిసారి వెండితెరపై మెరిసింది. ఈ మూవీ సాధించిన అనూహ్య విజయంతో ఈ అమ్మడి పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది
నిధి అగర్వాల్ హైదరాబాద్‌లో పుట్టి బెంగళూర్ లో పెరిగింది. స్వతహాగా హిందీ మాట్లాడే మార్వారీ కుటుంబంలో జన్మించిన ఆమె హిందీ అర్థం చేసుకోవడంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మాట్లాడగలదు. ఆమె విద్యాబ్యాసం విద్యశిల్ప్ అకాడమీ, విద్యా నికేతన్ పాఠశాలలో జరిగింది.
బెంగళూరుకు చెందిన క్రైస్ట్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనెజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్.
మంగళూరులో సైన్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఇస్మార్ట్ పోరి నభా నటేష్ ఆ తర్వాత వెండితెరపై తన నటనతో అందాల ఆరబోతతో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…