Anchor Anitha Chowdary : తెలుగులో ఎంతో మంది యాంకర్స్ ప్రస్తుతం ఉన్నా ఒకప్పట్లో మాత్రం యాంకర్స్ అనగానే సుమ, ఉదయభాను, ఝాన్సీ, అనిత చౌదరి, శిల్ప గుర్తొస్తారు. ఈటీవీ, జెమిని ఛానల్స్ వచ్చిన తొలి నాళ్లలో యాంకర్స్ గా వీరు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వీరిలో అనిత చౌదరి అటు యాంకర్ గా చేస్తూనే ఇటు సీరియల్స్ లో కూడా నటిస్తూ పేరు తెచ్చుకుంది. కస్తూరి, ఋతురాగాలు వంటి సీరియల్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. ఇక సెలబ్రిటీ ఇంటర్వ్యూలను చేస్తూనే సినిమా అవకాశాలు అందుకున్నారు. అలా తను నటించిన సినిమాల గురించి ఇక తన వ్యక్తిగత విషయాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఛత్రపతిలో అందరూ వద్దన్నారు…
యాంకర్ గా బాగానే రానిస్తున్న సమయంలో హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా వదులుకున్నట్లు తెలిపిన అనిత, అయితే కొంత కాలానికి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అలానే సీరియల్స్ లో నటించింది. అలా పెళ్లికి ముందు చేసిన సినిమా ‘ఛత్రపతి’ అందులో డీ గ్లామరస్ పాత్రలో నటించిన అనిత ఆ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఛత్రపతి సినిమా విషయంలో రమారాజమౌళి, రాజమౌళి నే అంతా చూసుకున్నారని, వాళ్ళు తనను ఎంపిక చేసునప్పుడు వారికి చాలా మంది ఈ సినిమా ఫ్లాప్ అయితే అది ఈ క్యారెక్టర్ అనిత చౌదరి చేయడం వల్లే అవుతుంది అని చెప్పినా వినకుండా తనను ఎంపిక చేసారని, ఈ విషయాలేవీ తనకు మొదట తెలియవని సినిమా షూటింగ్ అయిపోయాక తెలిసిందని చెప్పారు అనిత.
ఇక ఒక డైరెక్టర్ సినిమా అయ్యాక అనిత తోనే డైరెక్ట్ గా చెప్పారట సినిమాకు నిన్ను ఎంపిక చేసిన రోజే చెప్పాను ఈ సినిమా పోతే అది అనిత వల్లే అని అంటూ నేరుగా చెప్పడంతో ఆశ్చర్యపోయారట. అనిత సినిమాలో ఆ పాత్రకు అంత వైటేజ్ ఉందా అని అనుకున్నారట. సినిమా అయ్యాక వెంటనే పెళ్లి అవ్వడం, అమెరికా వెళ్లడం వల్ల సినిమా చూడలేదని అన్నారు. ఈ మధ్యే సినిమా చూసానంటూ అసలు నేనేం చేసానో నాకు తెలియదు నాన్న సీరియల్ టైములో తీసుకోచ్చి నాతో యాక్ట్ చేయించుకున్నారు రాజమౌళి, వాళ్ళ కష్టమే అదంతా అంటూ ఆ సినిమా విశేషాలను తెలిపారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…