Featured

Anchor Anitha Chowdary : నాకు యాక్సిడెంట్ అయినపుడు బాలకృష్ణ చేసిన హెల్ప్ మర్చిపోలేను : అనితా చౌదరి

Anchor Anitha Chowdary : తొంభైల్లో యాంకర్ గా అన్ని ఛానెల్స్ లో పనిచేసి పాపులర్ అయిన అనిత చౌదరి ఈటీవీ లో యాంకర్ గా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసారు. ఆ తరువాత మంజుల నాయుడు గారి సీరియల్ కస్తూరితో మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత వరుసగా ఋతు రాగాలు, నాన్న అంటూ సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమాల్లోను నటించిన అనితా చౌదరి మొదట హీరోయిన్ గా శ్రీకాంత్ సినిమాలో అవకాశం వచ్చి స్క్రీన్ టెస్టు లో పాస్ అయినా రాజమండ్రి లో ఎక్కువ రోజులు షూటింగ్ అవడంతో అవకాశం వదులుకుంది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన అనిత ప్రస్తుతం బుల్లితెర, వెండి తెరకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కెరీర్ పరమైన విశేషాలను తెలిపారు.

యాక్సిడెంట్ అప్పుడు బాలకృష్ణ చాలా హెల్ప్ చేశారు…

సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కార్యక్రమాలను చేస్తూ బాగా పాపులర్ అయిన అనితా చౌదరి అటు తన నటనతోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో నటించినా ఎప్పుడూ బాలకృష్ణ గారితో నటించే అవకాశం రాలేదని చెబుతూ అసలు పరిచయం లేకపోయినా నాకు సహాయం చేసారంటూ చెప్పింది. ఆక్సిడెంట్ అయి డిస్క్ విరిగి హాస్పిటల్ లో ఉన్నపుడు నా స్నేహితురాలు ఒకరు బాలకృష్ణ గారి అభిమాని అవ్వడంతో ఆయనతో సన్నిహిత పరిచయం ఉండటంతో నా గురించి చెప్పింది.

అయితే ఆయన వెంటనే హాస్పిటల్ వచ్చి నన్ను పరామర్శించి ఆర్థిక సహాయం కూడా చేసారు. అంత పెద్ద హీరో అదంతా చేయాల్సిన పని లేదు కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తి అంటూ బాలకృష్ణ గారి గురించి చెప్పారు. ఇక ఆయన గురించి వచ్చే మీమ్స్ చూస్తే అలాంటి వ్యక్తిని ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకుంటున్నారు అనిపిస్తుంది అంటూ ఆమె అభిప్రాయాలను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago