Movie News

Punch Prasad: నడవలేని స్థితిలో జబర్దస్త్ కమెడియన్.. ఆయన పరిస్థితి చూస్తే కన్నీళ్లాగవు?

Punch Prasad: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమంది కమెడియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి మంచి హోదాను కల్పించింది. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన వారిలో కమెడియన్ పంచ్ ప్రసాద్ ఒకరు.

పంచ్ ప్రసాద్ జబర్దస్త్ కార్యక్రమంలోనూ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలోను తన పంచ్ డైలాగులతో అందరిని సందడి చేసేవారు. అయితే ఈయన గతంలో ఓసారి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ విషమ పరిస్థితులలోకి వెళ్లిపోయారు ఆ సమయంలో జబర్దస్త్ కమెడియన్లు, రోజా నాగబాబు వంటి వారు ఆర్థిక సహాయం చేసి ఆయనకు సర్జరీ చేశారు.

ఈ విధంగా సర్జరీ చేయించుకున్నటువంటి ప్రసాద్ కొన్ని రోజుల తర్వాత జబర్దస్త్ కార్యక్రమంలోకి వచ్చి ఎప్పటిలాగే తన పంచ్ డైలాగులతో అందరినీ సందడి చేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఈయన జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఏం జరిగింది అని అందరూ సందేహాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ నూకరాజు ఆసియా పంచ్ ప్రసాద్ జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉండడానికి గల కారణాలను తెలియజేశారు.

దీన పరిస్థితిలో భార్య పిల్లలు..

పంచ్ ప్రసాద్ మరోసారి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈయన పరిస్థితి మరోసారి క్షీణించడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. కిడ్నీ వ్యాధి కారణంగా పంచ్ ప్రసాద్ కాళ్లు కూడా చచ్చుబడిపోయాయని, ఈయన కనీసం నడవలేని స్థితిలో కూడా ఉన్నారని తెలియజేశారు.ఇలా పంచ్ ప్రసాద్ మరోసారి అనారోగ్యానికి గురికావడంతో ఆయన భార్య పిల్లలు ఎంతో దీనస్థితిలో ఉన్నారని వెల్లడించారు. తన ఆరోగ్యం కోసం ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లు ఈ సందర్భంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి తెలియజేయడంతో ఎంతో మంది అభిమానులు ఆయనకు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago