Anchor Anitha Chowdary : తెలుగులో ఎంతో మంది యాంకర్స్ ప్రస్తుతం ఉన్నా ఒకప్పట్లో మాత్రం యాంకర్స్ అనగానే సుమ, ఉదయభాను, ఝాన్సీ, అనితా చౌదరి, శిల్ప గుర్తొస్తారు. ఈటీవీ, జెమిని ఛానల్స్ వచ్చిన తొలి నాళ్లలో యాంకర్స్ గా వీరు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వీరిలో అనితా చౌదరి అటు యాంకర్ గా చేస్తూనే ఇటు సీరియల్స్ లో కూడా నటిస్తూ పేరు తెచ్చుకుంది. కస్తూరి, ఋతు రాగాలు వంటి సీరియల్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. ఇక సెలబ్రిటీ ఇంటర్వ్యూలను చేస్తూనే సినిమా అవకాశాలు అందుకున్నారు. ఇక తన వ్యక్తిగత విషయాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
వాళ్ళతో సినిమా చేయకపోడానికి కారణం అదే… వాళ్లిద్దరూ చాలా స్ట్రాంగ్…
టీవీ యాంకర్ గా బాగా ఫేమస్ అయ్యాక అనిత కు సినిమా అవకాశాలు వచ్చాయి. ఈవివి గారి సినిమా ‘తాళి’ లో మొదట స్క్రీన్ టెస్టు చేసి అనితను సెలెక్ట్ చేసినా యాంకరింగ్ కొన్ని నెలలు మానేయమనడంతో సినిమా అవకాశాన్ని వదులుకుంది. ఇక ముప్పలనేని శివ గారి దర్శకత్వంలో చిరంజీవి గారి సినిమాలో చెల్లి అవకాశం వచ్చినా డేట్స్ కుదరక చేయలేదు, నేను చెల్లి పాత్రలు చేయాలని అనుకున్నాను కానీ ఆ సినిమా పోయింది అంటూ చెప్పారు.
ఇక తనతో పాటు యాంకరింగ్ లో అప్పట్లో ఫేమస్ అయిన సుమ, ఝాన్సీ, సునీత గురించి మాట్లాడుతూ నాకు కష్టం వచ్చినపుడు వాళ్ళున్నారు అలాగే వాళ్లకు కష్టమోచ్చినపుడు నేను ఉన్నాను. నాకుటుంబంతో కంటే వారితో ఎక్కువ ఉన్నాను అంటూ చెప్పారు. సునీత, ఝాన్సీ ఇద్దరూ చాలా స్ట్రాంగ్, బాగా పోరాడుతారు లైఫ్ లో వారి వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా చర్చించం, విషయం తెలిసినా సైలెంట్ గా ఉండి వాళ్ళు చెబితేనే వింటాం మిగిలిన వాళ్ళం కానీ ఇప్పటికీ మేము మంచి స్నేహితులం అంటూ అనిత చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…