Featured

Chiranjeevi: 15 ఏళ్ల క్రితం అవమానం.. అదే చోట నేడు అభిమానం.. ఇదే కదా నిజమైన గెలుపు?

Chiranjeevi: ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాల గురించి మాత్రమే మాట్లాడేవారు తెలుగు సినిమాలకు గతంలో ఏ విధమైనటువంటి ఆదరణ గౌరవ మర్యాదలు ఇచ్చేవారు కాదు. ఈ క్రమంలోనే 2007వ సంవత్సరంలో జరిగిన వజ్రోత్సవాల్లో భాగంగా తెలుగు సినిమాలకు ఎంతో అవమానం జరిగిందని గతంలో ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది బాలీవుడ్ నటీనటుల ఫోటోలు ప్రదర్శించబడినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణమైనటువంటి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి వారి విగ్రహాలు లేకపోవడం చాలా బాధాకరంగా ఉందని తెలుగు చిత్ర పరిశ్రమకు సరైన గౌరవం లభించలేదంటూ గతంలో చిరంజీవి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా ఎక్కడైతే తెలుగు చిత్ర పరిశ్రమకు అవమానం జరిగిందో ఇప్పుడు అదే వేదికపై తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గౌరవ మర్యాదలు లభించడం విశేషం.గోవాలో జరగబోతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా ఎన్నో తెలుగు సినిమాలను ప్రదర్శించడం విశేషం. ఒకప్పుడు ఏ వేదికపై అయితే మనకు గౌరవం లభించలేదో ఇప్పుడు అదే వేదికపై తెలుగు సినిమాలను ప్రదర్శించబడటంతో తెలుగు సినిమా ఖ్యాతి ఎలాంటి శిఖరాలను చేరుకుందో అర్థమవుతుంది.

ఇండియన్ పనోరమా విభాగంలో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సినిమాలు…

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ విధమైనటువంటి గుర్తింపు రావడానికి గల కారణం ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పాలి. ఆయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.ఆనాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి గుర్తింపు లేదని మెగాస్టార్ బాధపడ్డారు ఇప్పుడు అదే వేదికపై తెలుగు చిత్ర పరిశ్రమకు గుర్తింపు రావడంతో గత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago