chiranjeevi:తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాల్సిన పనిలేదు. పునాదిరాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం ప్రాణం ఖరీదు సినిమాతో ప్రేక్షకులను సందడి చేశారు.
ఈ విధంగా చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ తన టాలెంట్ తో కెరియర్ మొదట్లో పలు సినిమాలలో సహాయ నటుడిగా పాత్రలలో నటించిన అనంతరం హీరోగా అవకాశాలను అందుకున్నారు.ఈ విధంగా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్లారు.
సుమారు 154 చిత్రాలలో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చిత్రపరిశ్రమలో అగ్ర హీరోగా నిలదొక్కుకోవడమే కాకుండా ఎన్నో పురస్కారాలను కూడా అందుకున్నారు. ఇలా చిరంజీవి ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఉత్తమ నటుడిగా మూడు నంది అవార్డులను అందుకున్నారు. అదేవిధంగా 7 ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2006వ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీకి ఈయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇతనికి పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.
ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్..
అయితే ఈయన కేవలం చిత్రపరిశ్రమకు మాత్రమే కాకుండా సమాజ సేవ కూడా చేస్తూ రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు.రక్తదానం నేత్రదానం శిబిరాలను ప్రారంభించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాల సినీ కెరియర్ లో తన కీర్తి కిరీటంలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. తాజాగా ఈయన మరొక పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది జరగనున్న 53వ ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందుకున్నారు.ఇలాంటి గొప్ప పురస్కారానికి చిరంజీవి ఎంపిక కావడంతో ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వేడుకలు గోవాలో జరుగుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…