Featured

Senior Actor Kavitha : ఎన్టీఆర్ వేరు… చంద్రబాబు నాయుడు వేరు..: సీనియర్ నటి కవిత

Senior Actor Kavitha : పదకొండేళ్ళకే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గాను అలాగే సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇటు రాజకీయాల్లోనూ ఉన్న కవిత గారు తన సినిమా కెరీర్ లో ఎదుర్కొన్న ఎన్నో అనుభవాలను పంచుకున్నారు. కవిత గారు తమిళ ఇండస్ట్రీలో మొదలు పెట్టి తెలుగులోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తరువాత హీరోయిన్ గా అడుగుపెట్టారు. చిరంజీవి, కృష్ణ ఎన్టీఆర్ ఇలా అందరి హీరోలతో చేసిన కవిత గారు కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో సినిమాలకు గుడ్ బై చెప్పేసారు. ఇక తను నటించే సమయానికి ఇండస్ట్రీ వాతావరణం గురించి తాజాగా యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు అలాగే రాజకీయాల్లో రంగప్రవేశం చేసి టీడీపీ లో ఉన్న కవిత ప్రస్తుతం బీజేపీ పార్టీ లో కొనసాగుతున్నారు.

ఎన్టీఆర్ వేరు, చంద్రబాబు వేరు…

సినిమాల్లో మంచి అవకాశాలు అందుకుంటూ రోజుకు మూడు షిఫ్ట్ లు పనిచేస్తున్న సమయంలో చెన్నై నుండి హైదరాబాద్ వచ్చి వెళ్తూ ఉండడం వల్ల ప్రొడ్యూసర్స్ కి నష్టం నీకు నష్టమే అని ప్రొడ్యూసర్ రామానాయుడు గారు, ఊరళి మోహన్ గారు చెప్పడం వల్ల హైదరాబాద్ కి వచ్చేసారట కవిత. అయితే హైదరాబాద్ వచ్చాక అవకాశాలు రాక చాలా వరకు ఖాళీగా ఉండేవారట. తెలుగు సినిమాల కోసం హైదరాబాద్ వచ్చేస్తే తెలుగులో అవకాశాలు రాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను.

ఆ సమయంలో తాను స్థాపించిన ఎన్జీఓ సంస్థకు ప్రభుత్వ సహాయం కోసం చంద్రబాబు గారిని కలవగా ఆయన రాజకీయాల్లోకి ఆహ్వానించి ఎమ్మెల్యే సీట్ ఇస్తాం పార్టీ తరుపున గెలిచాక విమెన్, చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ని చేస్తాం, మీరు ఇంకా ఎక్కువ సోషల్ సర్వీస్ చేయొచ్చు అని చెప్పడం తో పార్టీలో చేరాను కానీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అంటూ చెప్పారు. రాజకీయాలు ఏమీ తెలియకపోయినా ఎన్టీఆర్ గారి పార్టీ తెలుగు వాళ్ళకోసం పెట్టిన పార్టీ అని అందులో చేరాను కానీ ఎన్టీఆర్ వేరు చంద్రబాబు వేరు అని ఆ తరువాత తెలిసింది అంటూ చెప్పారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి ఆలోచనలు పథకాలు నచ్చి బీజేపీ లో ఉన్నట్లు వివరించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago