Nagashaurya: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ హీరో నాగశౌర్య బెంగుళూరు అల్లుడుగా మారిన విషయం మనకు తెలిసిందే. ఇన్ని రోజులు బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నటువంటి నాగశౌర్య తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పే ఆదివారం అనూష శెట్టి అనే వ్యాపారవేత్తతో ఏడడుగులు నడిచారు. ఈయన వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఇకపోతే నాగశౌర్య అనూష శెట్టి వివాహం అని తెలియగానే అనూష శెట్టి గురించి పెద్ద ఎత్తున ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈమె బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె వీరికి పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయని తెలుస్తోంది.ఇక అనూష శెట్టి కూడా ప్రముఖ ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్ లో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇలా అనూష శెట్టితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది.అనూష తండ్రి పేరు పై వందల కోట్ల ఆస్తిపాస్తులు ఉండగా అనూష పేరుమీద కూడా కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు సమాచారం.ఈ క్రమంలోనే అనూష శెట్టి నాగశౌర్యకు ఏ మొత్తంలో కట్నం కానుకలు తీసుకువచ్చారు అనే విషయం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
కోట్ల రూపాయల ఆస్తిని కట్నంగా ఇచ్చిన అనూష శెట్టి…
ఇలా అనూష శెట్టి హీరో నాగశౌర్యకు పెళ్లి సమయంలో నగదు రూపంలో ఏ విధమైనటువంటి కట్న కానుకలు చెల్లించలేదని తెలుస్తోంది.అనూష పేరు మీద సుమారు 50 నుంచి 80 కోట్ల రూపాయల వరకు ఆస్తిపాస్తులు ఉన్నట్టు సమాచారం వాటిలో కొన్నింటిని నాగశౌర్య పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి నాగశౌర్య అనూష శెట్టిని వివాహం చేసుకోవడంతో ఈయన భారీగానే కట్నాన్ని ఆస్తి రూపంలో తీసుకున్నారని తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…