Senior Journalist imandhi ramarao : సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్టీఆర్ తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నా హీరో. కష్టపడి పైకి వచ్చి ఆయనకంటూ ఒక కొత్త ఇమేజ్ ను సృష్టించుకుని అశేష తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి అంతకు మించి మైలు రాయి వంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన మిగతా హెరోలతో పోలిస్తే సంపాదించింది చాలా తక్కువ. అందరిలా ఆయన రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటే ఆయన ఈరోజు కోట్ల ఆస్తులను సంపాదించిండేవాడు కానీ ఆయన ఎందుకు అలా చేయలేదు అనే విషయాలను సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.
నిర్మాతల హీరోగా ఉన్న కృష్ణ…
కృష్ణ గారికి సినిమాలంటే ఎంత ఇష్టమంటే ఆయన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా 3 షిఫ్ట్లు పనిచేసి ఏడాదికి పదిహేడు సినిమాలలో నటించేవారు. పడుకున్నప్పుడు కూడా ఆయన నిద్రపోతున్న సీన్స్ ఏవైనా ఉంటే తీసుకోమని చెప్పవారట. ఇక ఒక సినిమాను ఎక్కువ రోజులు లాగ్ చేయకుండా వీలైనంత త్వరగా పూర్తి చేసేవారు. ఇవన్నీ ఒకటి ఆయన రెమ్యూనరేషన్ విషయంలో వ్యవహరించిన తీరు ఒకెత్తు అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఒక సినిమాకు అప్పట్లో ఆయన పదహైదు వేలు రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఆయన మార్కెట్ కి అది చాలా తక్కువ అయినా కానీ నిర్మాతను ఇబ్బంది పెట్టకూడదని అలా చేసేవారు.
ఇక గూడాచారి వంటి సినిమా సూపర్ హిట్ అయినా ఆయన రెమ్యూనరేషన్ పెంచలేదు. ఇరవైవేలు ఇస్తామని మొదట చెప్పి సినిమా చేసాక ఎగొట్టిన వారు ఎందరో అయినా వారితో మళ్ళీ సినిమాలను చేశారు. ఇక చెల్లని చెక్కులు ఎన్ని ఉంటాయో ఆయన దగ్గర వివరిస్తూ ఆ చెక్కులను పద్మాలయా స్టూడియో మొత్తం తోరణాలు కట్టినా ఇంకా మిగులుతాయి అంటూ నవ్వేవారట. అలా ఆయన అందరిలా రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటే ఆయనిచ్చిన సూపర్ హిట్లకు తగ్గ రెమ్యూనరేషన్ తీసుకొని ఉంటే ఆయన ఇపుడు కొన్ని వేలకోట్లు సంపాదించినవాడయ్యేవాడు అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…