Featured

Roja adopted Daughter Pushpa : రోజా దత్తత తీసుకున్న అమ్మాయి ఇపుడు ఏమి చేస్తోందో తెలుసా?? పుష్ప సక్సెస్ స్టోరీ…!

Roja adopted Daughter Pushpa : మట్టిలో మాణిక్యం ఈ అమ్మాయి పుష్ప. చిన్నత్తనంలోనే తండ్రిని, పదవ తరగతి సమయానికి తల్లిని కోల్పోయి ఎవరూ లేని ఒంటరి అయినా ఎంచుకున్న లక్ష్యం వైపు సాగింది. మన లక్ష్యం గొప్పదయినపుడు దారులు కూడా అవే తెరుచుకుంటాయి. మనకు చేయూత నిచ్చే చేతులు తోడొస్తాయి. అలానే పుష్ప వైద్యురాలు కావాలనే గట్టి సంకల్పానికి ఆదుకునే చేతులు అండగా నిలబడ్డాయి. ఆమె లక్ష్యాన్ని చేరుకోడానికి తమ వంతు సహాయం అందించాయి. నగరి ఎమ్మెల్యే అలాగే ఏపీ మంత్రి రోజా ఏపీ సీఎం జగన్ పుట్టినరోజునాడు ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ అమ్మాయి చదువు బాధ్యత నాదే అంటూ హామీ ఇచ్చారు. ఆ అమ్మాయి నేడు డాక్టర్ గా విద్యని అభ్యసిస్తోంది.

అమ్మ, నాన్న వైద్యం లేక మరణించడంతో వైద్యరాలు కావాలని అనుకున్నా…

చిన్నపటి నుండి పేదరికంలో ఉన్న పుష్ప ను తల్లి చదివించింది. పదో తరగతి లో తల్లి కూడా మరణించడంతో స్కూల్ ప్రిన్సిపాల్ చొరవ చూపి ప్రభుత్వ హాస్టల్, కాలేజీ లో చేర్పించారు. ఇక చదువులో ముందున్న పుష్ప ను ఎమ్మెల్యే రోజా వద్దకు తీసుకెళ్లగా జగన్ పుట్టినరోజు కానుకగా పుష్ప ను దత్తత తీసుకుని ఆమె చదువు బాధ్యత తీసుకున్నారు. ఇక అలా నీట్ కోచింగ్ లాంగ్ టర్మ్ ఇప్పించి మెడిసిన్ సీట్ కొట్టేందుకు తమ వంతు సహాయం చేసారు.

ఇప్పుడు పద్మావతి మహిళా కళాశాలలో వైద్య వృత్తిని అభ్యశిస్తున్న పుష్ప పేదలకు వైద్య చేయడం లక్ష్యం అంటూ చెబుతోంది. ఒక ఆసుపత్రి కట్టి వైద్యసేవలు పొందలేక ఇబ్బందిపడుతున్న వారికి సహాయం చేస్తానని అలాగే తనలా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చదివిస్తానంటూ చెబుతోంది. ఇక తనను దత్తత తీసుకుని తమ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటున్న ఎమ్మెల్యే రోజా కు కృతజ్ఞతలు తెలిపింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago