Movie News

Anchor Lasya: ఘనంగా యాంకర్ లాస్య సీమంతం…. సందడి చేసిన బుల్లితెర సెలబ్రిటీలు!

Anchor Lasya: టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్లుగా చాలామంది పాపులర్ అయ్యారు. ఇలా బుల్లితెర యాంకర్ గా పాపులర్ అయిన వారిలో యాంకర్ లాస్య కూడా ఒకరు.మొదట మ్యూజిక్ ఛానల్లో యాంకర్ రవితో కలిసి యాంకరింగ్ చేసిన లాస్య ఆ తర్వాత టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు పొందింది. ఇక ఢీ డాన్స్ షోలో టీం లీడర్ గా వ్యవహరించిన లాస్య కూడా బాగా పాపులర్ అయింది.

ఇలా యాంకర్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో మంజునాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని కొంతకాలం ఇండస్ట్రీకి దూరం అయింది. ఇక లాస్య మంజునాథ్ కి ఇప్పటికే ఒక బాబు ఉన్నాడు. లాస్య బుల్లితెరకు దూరమైన కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటుంది. సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ప్రతిరోజు ఏదో ఒక వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.

ఈ క్రమంలో ఇటీవల లాస్య రెండవసారి తల్లి కాబోతున్న విషయం తన అభిమానులతో పంచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అప్పటినుండి లాస్య తన ప్రెగ్నెన్సీ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అప్డేట్స్ ఇస్తోంది. ఇక తాజాగా లాస్య సీమంతం వేడుక చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సీమంతం వేడుకలలో పలురువు బుల్లితెర సెలబ్రిటీలు హాజరయ్యి సందడి చేశారు.


Anchor Lasya: లాస్య సీమంతంలో సందడి చేసిన బిగ్ బాస్ గీతూ….

ఈ సీమంతం వేడుకల్లో బిగ్ బాస్ బ్యూటీ గీతు రాయల్, సీరియల్ ఆర్టిస్ట్ సుష్మ, శ్రీ వాణి వంటి తదితరులు పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో లాస్య పింక్ కలర్ పట్టు చీరలో మెరిసిపోతూ చాలా అందంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా లాస్య అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తొందరలోనే జూనియర్ లాస్య రావాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

3 minutes ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

10 minutes ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

17 minutes ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

24 minutes ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

37 minutes ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

46 minutes ago