Sharwanand: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఉన్నారని చెప్పాలి. అయితే వీళ్ళందరూ కూడా పెళ్లి మాట వచ్చేసరికి మొఖం చాటేస్తున్నారు. ఇలా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో శర్వానంద్ కూడా ఒకరు. ఇండస్ట్రీలో హీరోగా దాదాపు దశాబ్దన్నర కాలంగా కొనసాగుతున్నారు. ఈయన హీరోగా కాకుండా పలు సినిమాలలో హీరోకి తమ్ముళ్లు పాత్రలలో కూడా నటించి మెప్పించారు.
ఇలా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నటువంటి శర్వానంద్ కు ఇదివరకు ఎన్నో సార్లు తన పెళ్లి గురించి డైరెక్ట్ గా ప్రశ్నలు ఎదురైనప్పటికీ ఈయన మాత్రం తనకన్నా ఇండస్ట్రీలో సీనియర్లు చాలామంది ఉన్నారని వారు పెళ్లి చేసుకున్న తర్వాతే చేసుకుంటానని సమాధానం చెప్పేవారు. అయితే తాజాగా శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్త వైరల్ అవుతుంది.
ఈయన తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అభిమానులు శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు ఏంటి అని ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలోనే శర్వానంద్ హైదరాబాద్ కి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారట. ఈమె అమెరికాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పని చేస్తూ ఇన్ని రోజులపాటు అమెరికాలోనే స్థిరపడ్డారు.
ఇక ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం సదుపాయం ఉండడంతో ఈమె హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కావడం విశేషం.ఇలా శర్వానంద్ తెలంగాణ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని ఇప్పటికే ఈ కుటుంబ సభ్యులకు కూడా వీరి పెళ్లి గురించి చర్చలు పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది .త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలవడునున్నట్లు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…