Featured

Krishna Vamsi: సింధూరం సినిమాని రీ-రిలీజ్ చేయమన్న నేటిజన్.. దండం పెట్టేసిన కృష్ణవంశీ!

Krishna Vamsi: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణవంశీ ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈయన దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను సందడి చేశాయి.ఇకపోతే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రి రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే కృష్ణవంశీ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సింధూరం. అయితే ఈ సినిమాని రిలీజ్ చేయమంటూ ఓ అభిమాని కృష్ణవంశీకే ట్వీట్ చేశారు.సింధూరం అంటే అద్భుతమైన సినిమాని మరోసారి థియేటర్లో చూడటం కోసం ఎంతో ఎదురు చూస్తున్నాం.ఈ సినిమాని కనుక థియేటర్లో విడుదల చేస్తే నాలుగు షోలు చూడటానికి మాలాంటి వాళ్ళు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారని దయచేసి మరొకసారి ఈ సినిమాని రీ రిలీజ్ చేయమని వేడుకుంటూ కృష్ణవంశీకి టాగ్ చేశారు.

ఇక ఈ ట్వీట్ కి కృష్ణవంశీ రిప్లై ఇస్తూ… వామ్మో సింధూరం సినిమా అప్పులు కట్టడానికి ఐదు సంవత్సరాలు కష్టపడ్డానయ్యా… వామ్మో అంటూ ఏకంగా దండం పెట్టేసారు. ఈ సినిమాలో వచ్చిన నష్టాలు అన్నింటిని తన భుజాలపై వేసుకొని సుమారు 5 సంవత్సరాల పాటు కష్టపడుతూ ఈ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చానని ఈ సందర్భంగా కృష్ణవంశీ తెలియజేశారు.

Krishna Vamsi: ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సింధూరం….

ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఈ సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయి. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు అందుకుంది అదేవిధంగా ద్వితీయ నంది అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా కోసం పని చేసిన చిత్ర బృందానికి సైతం అవార్డులు వరించాయి. ఇలా ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకున్నప్పటికీ కమర్షియల్ గా దారుణమైన కలెక్షన్లను రాబట్టడంతో భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago