Actress Ravali: ఒకానొక సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో నటీమణులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ కూడా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా రమ్యకృష్ణ, ఆమని, రోజా, ఇంద్రజ, మీనా వంటి వారందరూ కూడా ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
వీటితో పాటు హీరోయిన్ గా తెలుగు తమిళ మలయాళ హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రవళి గురించి అందరికీ సుపరిచితమే. ఈమె ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ పొందారు. అయితే ఈమె 2007వ సంవత్సరంలో నీలి కృష్ణ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
వివాహం తర్వాత రవళి పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే ఈమె పెళ్లి అనంతరం ఇండస్ట్రీకి దూరం అవ్వడమే కాకుండా ఎక్కడా కూడా ఇంటర్వ్యూలలో కానీ సోషల్ మీడియాలో కానీ యాక్టివ్ గా లేరు. దీంతో రవళి గురించి దాదాపు అభిమానులు మర్చిపోతున్న క్రమంలో ఈమె తిరుపతిలో సందడి చేశారు.
ఇటీవల కాలంలో ఈమె తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం తిరుపతి చేరుకున్నారు. అయితే స్వామివారి దర్శనం అనంతరం రవళి మీడియా కంటపడింది. దీంతో ఫోటోగ్రాఫర్లు ఈమెను ఒక్కసారిగా తమ కెమెరాలలో బంధించారు.ఇక రవళి తాజా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈమె ఫోటోలు చూసినటువంటి అభిమానులు షాక్ అయ్యారు. అధిక శరీర బరువుతో రవళి ఉండడంతో రవళి ఏంటి ఇలా మారిపోయారనీ అభిమానులు షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత రవలిని ఇలా చూడటం సంతోషంగానే ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…