Movie News

Santosham movie Child Artist: సంతోషం సినిమాలో నాగార్జున కొడుకుగా నటించిన ఆ బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

Santosham movie Child Artist: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నాగార్జున ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. ఇలా నాగార్జున నటించిన సంతోషం సినిమా కూడా 2002లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున సరసన గ్రేసీ సింగ్, శ్రీయ హీరోయిన్లుగా నటించారు.2002 మే 9వ తేదీన విడుదలైన ఈ సినిమా సక్సెస్ పుల్ గా 100 రోజులు ఆడింది.

ఇక ఈ సినిమాలో మొదట నాగార్జున గ్రేసీ సింగ్ ని ప్రేమించి పెద్దలను ఎదురించి వివాహం చేసుకుంటాడు. వీరికి ఒక బాబు పుట్టిన తర్వాత ప్రమాదవశాత్తు గ్రేసీ సింగ్ మరణిస్తుంది. అందువల్ల ఆమె కుటుంబసభ్యులు నాగార్జున మీద చాలా కోపంగా ఉంటారు. ఇక ఈ సినిమాలో నాగార్జున కొడుకు లక్కీ పాత్రలో నటించిన మాస్టర్ అక్షయ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఈ సినిమాలో తన క్యూట్ నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ‘బాయ్ బాయ్ హింస రాజు’ అంటూ కామెడీ సన్నివేశాలతో అందరినీ నవ్విస్తూ నాగార్జునతో కలిసి ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా బాగా నటించాడు.

ఇప్పటికీ ఈ సినిమాలోని అక్షయ్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సూపర్ హిట్ సినిమా విడుదలై ఇప్పటికీ 21 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ మేరకు సంతోషం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మాస్టర్ అక్షయ్ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంతోషం సినిమా క్యూట్ గా ఉన్న అక్షయ్ పెరిగి పెద్దయిన తర్వాత ఇప్పుడు చూడటానికి హీరోలా ఉన్నాడు.

Santosham movie Child Artist: ఇండస్ట్రీలో బిజీగా ఉన్న అక్షయ్…

ఇక అక్షయ్ ప్రస్తుతం పలు యాడ్స్ లో నటించటమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘వాంటెడ్’ సినిమాలో హీరోయిన్ అయేషా టాకియాకి తమ్ముడిగా అక్షయ్ నటించాడు. అక్షయ్ నటుడిగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా మంచి టాలెంట్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అక్షయ్ తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ లో అక్షయ్ సింగింగ్ వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం అక్షయ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago