Featured

Madhu Sivabalaji: యూట్యూబ్ నుండి ఎన్ని లక్షలు వస్తున్నాయంటే… ఆస్తులన్నీ అమ్మేయడానికి కారణం అదే… రోడ్డు మీదకి వచ్చేసాం… అప్పుడు ఏడ్చడానికి కారణం..: మధుమిత శివబాలాజీ

Madhu Sivabalaji : ‘ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ బాలాజీ ఆ తరువాత ఎలా చెప్పను, దోస్త్ సినిమాల్లో నటించారు. అయితే శివ బాలాజీ కి మంచి పేరు తెచ్చిన సినిమా మాత్రం ‘ఆర్య’. బన్నీ నటించిన ఆర్య సినిమాల్లో విలన్ షేడ్ ఉన్న పాత్రలో అజయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత సంక్రాంతి సినిమాతో మరో మంచి హిట్ అందుకున్న శివ బాలాజీ తన 17 ఏళ్ళ వయసులోనే తండ్రి వ్యాపారాలను చూసుకుంటూ 22 ఏళ్లకే సొంత వ్యాపార సంస్థలను పెట్టాడు. ఇక సినిమాల మీద ఆసక్తితి ఇండస్ట్రీ వైపు వచ్చిన శివ బాలాజీ నటి మధుమితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వారి లవ్ స్టోరీ, వైవాహిక జీవితం గురించిన ముచ్చట్లను తాజాగా ఒక ఇంటర్వ్యూలో మధు శివబాలాజీ పంచుకున్నారు.

వ్యాపారంలో నష్టం… యూట్యూబ్ నుండి ఎంత…

చిన్నావయసులోనే వ్యాపారంలో అడుగుపెట్టిన శివ బాలాజీ, తన తండ్రి వ్యాపారం చూసుకుంటూ ఆ తరువాత సొంత వ్యాపారం చేస్తూ సినిమాల మీద ఇంట్రస్ట్ తో సినిమాల్లోకి వచ్చారు. అయితే తండ్రి మరణించాక తన తండ్రికి సంబంధించిన ఫ్యాక్టరీ నష్టాల్లో ఉండటం వల్ల ఆస్తులన్నీ అమ్మేసి సెటిల్ చేసి చెన్నయ్ నుండి హైదరాబాద్ వచ్చేసారట బాలాజీ. అయితే పెళ్లయ్యాక సినిమాలే కాకుండా సొంత వ్యాపారం మళ్ళీ మొదలు పెట్టినా అది సక్సెస్ కాలేదు దీంతో బాగా నష్టపోయారు.

ఇక దాని తరువాత సొంతంగా సినిమా తీసి మరోసారి బాగా నష్టపోవడంతో ఇబ్బంది పడ్డారట. లోలోపలే కుమిలి పోయాను అంటూ బాలాజీ ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక మధుమిత తమ కుటుంబానికి సంబంధిచిన వీడియోలను పేస్ బుక్ మాద్యమం ద్వారా ప్రేక్షకులకు అందిస్తుండగా చాలా మంది యూట్యూబ్ లో అప్లోడ్ చేయమని అడగడంతో మొదలు పెట్టగా మంచి వ్యూస్, లైక్స్ తో చాలా తక్కువ సమయంలో ఎక్కువమంది సబ్స్క్రయిబర్స్ వచ్చారట ఛానెల్ కి. యూట్యూబ్ లో పెట్టే కంటెంట్ ని బట్టి చూసేవాళ్ళు అభిమానించేవాళ్ళు పెరుగతారని అలానే డబ్బు వస్తుందంటూ మధు తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago