Anchor Lasya: యాంకర్ లాస్య పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఏనుగు చీమ కథ చెబుతూ ఎంతో ఫేమస్ అయినటువంటి లాస్య ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ వచ్చారు. ఇలా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.
ఈమె మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఇలా పెళ్లి తర్వాత లాస్య బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం ఏదైనా స్పెషల్ ఈవెంట్ లో మాత్రమే లాస్య సందడి చేస్తున్నారు. ఇక ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక బిగ్ బాస్ తర్వాత యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే తరచూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేసే లాస్య తాజాగా మామిడి తోటలో ఫ్యామిలీతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన ఫ్యామిలీ కోసం మామిడి తోటలో నాటుకోడి పులుసు వండారు.
కట్టెల పొయ్యపై పచ్చని ప్రకృతి అందాల నడుమ ఈమె ఎంతో రుచికరమైనటువంటి నాటుకోడి పులుసును వండుతూ అందరికీ నోరూరించేశారు.తన భర్తకు నాటుకోడి పులుసు అంటే ఎంతో ఇష్టమని లాస్య ప్రత్యేకంగా తన భర్త కోసం ఇలా చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…