Categories: FeaturedMovie News

Hero JD Chakravarthy : జీవితంలో ఎన్టీఆర్ కారు ఎక్కను… కళ్ళు మూసుకుని డ్రైవ్ చేసాడు…: హీరో జేడి చక్రవర్తి

Hero JD Chakravarthy : శివ సినిమాతో తెలుగులో పరిచయమైన నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి కంటే జేడి చక్రవర్తి అనగానే ప్రేక్షకులకు గుర్తిస్తారు. మొదటి సినిమా క్యారెక్టర్ పేరును తన పేరులో పెట్టుకున్న జేడి చక్రవర్తి శివ, సత్య, దెయ్యం, ఎగిరే పావురమా, మనీ, మనీ మనీ అంటూ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తంపు తెచ్చుకున్నాడు. గురువు ఆర్జీవి బాటలో హిందీలో అనేక సినిమాల్లో నటించిన జేడీ, అటు తమిళం, కన్నడ, మాలయాళం సినిమాల్లో నటించారు. అలాగే దర్శకత్వం కూడా కొన్ని సినిమాలకు చేసారు. తాజాగా యుట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఎన్టీఆర్ తో అస్సలు వెళ్ళను…

చక్రవర్తి సినిమాల్లో మొదట ఎవరికైనా గుర్తిచ్చే పాట మేఘాలలో తేలిపోతున్నది తుఫానుల… పాట. ఆ పాటలో స్పీడ్ గా బైక్ మీద తన గర్ల్ ఫ్రెండ్ తో షికారుకి వెళ్తాడు. అదే పాట మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కూడా బాగా ఇష్టమట. ఆ పాట ప్లే చేస్తూ ఒకసారి కారులో జేడి చక్రవర్తిని కూడా షికారుకి తీసుకెళ్లాడట ఎన్టీఆర్. మెహదీపట్నం నుండి టోలిచౌకీ కి కారులో తీసుకెళ్లాడట. అదికూడా 100-110 స్పీడ్ లో తీసుకెళ్లాడు అందుకు భయం వేయలేదు కానీ మధ్యలో కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుంది అని అడిగాడు.

నన్నేమో అనుకున్నా కానీ కాదు తాను కళ్ళు మూసుకుని డ్రైవ్ చేసాడు, భయంవేసింది. నువ్వు కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తే మనమిద్దరం కళ్ళు మూయాల్సి వస్తుంది వద్దు తారక్ అని చెప్పినా కళ్ళు మూసుకుని డ్రైవ్ చేసాడట తారక్. ఆ సంఘటన లైఫ్ లో మర్చిపోలేనని ఆరోజు అర్థమైంది బైక్ లో స్పీడ్ గా మహేశ్వరీ ని పాటలో తీసుకెళ్ళినపుడు తానెలా ఫీల్ అయ్యుంటుందో అంటూ ఆ సంఘటన ను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు చక్రవర్తి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago