Writer Vijayendra prasad : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రాణా, అనుష్క, రమ్యకృష్ణ నటించిన సినిమా బాహుబలి. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి రికార్డులను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. సినిమా రికార్డ్స్ గురించి మాట్లాడాలంటే ఇప్పటికీ బాహుబలి ముందు బాహుబలి తరువాత అనే మాట్లాడుతాం. అంతలా చరిత్ర సృష్టించిన బాహుబలి సినిమా కథను సృష్టించింది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు. ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాహుబలి సినిమా గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పవన్ ఫ్యాన్స్ ను చూసే ఆ సీన్ పెట్టాను…
బాహుబలి రెండో భాగంలో ఇంట్రవెల్ దగ్గర వచ్చే పట్టాభిషేకం సన్నివేశం చూసిన ప్రేక్షకుడికి ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అలా ఆ సీన్ డిజైన్ చేయాలని ఎలా అనిపించింది అనే ప్రశ్న ప్రసాద్ గారికి ఎదురుకాగా బాహుబలి ఆడియో వేడుక తిరుపతిలో చేసినపుడు జరిగిన ఒక సంఘటన ఆ సీన్ కు ప్రేరణ అంటూ చెప్పారు. బాహుబలి ఆడియో ఫంక్షన్స్ లో అడవి శేష్ నాకు మొదట అవకాశం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంతో అక్కడున్న పవన్ అభిమానులు జై పవర్ స్టార్ అంటూ అరవడం మొదలు పెట్టారు.
ఆ వేడుక ప్రభాస్ ది కానీ అక్కడ పవర్ స్టార్ అంటూ అరుస్తున్నారు. ఆపండి అని చెబితే మరింత అరుస్తారు అందుకే సైలెంట్ గా ఉంటే ఫంక్షన్ అయిపోయే వరకు అలానే అరుస్తూ ఉన్నారు. ఆ సంఘటనే ఈ సీన్ కి ప్రేరణగా నిలిచింది. భల్లాల దేవుడు రాజు అయినా ఆయనకు రాజైన ఆనందం ఉండదు. బాహుబలి సైన్యాధ్యక్షుడు అయినా రాజులాగే జనం చూస్తారు. థియేటర్లలో కూడా జనాలతో చప్పట్లు కొట్టించిన సన్నివేశాల్లో ఒకటిగా ఆ సీన్ నిలిచింది అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…