Sudhkar: తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కమెడియన్ సుధాకర్ అనంతరం తమిళంలో అవకాశాలు రాకపోవడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా స్థిరపడ్డారు.
ఇలా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఈయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉండటంతో సుధాకర్ చనిపోయారని అందరూ భావించారు కానీ ఆయన నేను బ్రతికే ఉన్నాను అంటూ చివరికి చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సుధాకర్ తాజాగా ఒక బుల్లితెర కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం ఈయన తన కుమారుడు బెనిడిక్ మైకేల్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుధాకర్ తన కుమారుడి ఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే తన కుమారుడు ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తనని మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలిపారు.
చిరంజీవి తనకు ఎప్పటినుంచో స్నేహితుడు ఇప్పటికీ మా మధ్య స్నేహం కొనసాగుతూనే ఉందని తెలియజేశారు. అయితే గతంలో తన కుమారుడు కాలేజీ సీట్ కోసం చిరంజీవి చాలా సహాయం చేశారని ఇప్పుడు కూడా తనని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి చిరంజీవి ఆదరణ తనపై ఉందని తానే ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు అంటూ సుధాకర్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…