Suman: సినీ నటుడు సుమన్ ఆది పురుష్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈయన ఈ సినిమాని వీక్షించి ఈ సినిమా గురించి తన అభిప్రాయాలను తెలియజేశారు.ప్రభాస్ నటించిన ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే సుమన్ తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలిపారు.
ఈ సినిమాలో రామాయణాన్ని రావణాసురుడు సీతాదేవి తీసుకెళ్లినప్పటి నుంచి తనని రక్షించే వరకు మాత్రమే చూపించారు. అయితే మనం చిన్నప్పటి నుంచి రాముడు అంటే నీలిరంగులో ఉండే వ్యక్తి అని మాత్రమే మనకు తెలుసు. కానీ ఇందులో మాత్రం ప్రభాస్ కి గడ్డం మీసాలు పెట్టి పూర్తిగా మార్చేశారు.ఇక రెండున్నర సంవత్సరాల పాటు ప్రభాస్ అదే బాడీని మెయింటైన్ చేయడం చాలా గ్రేట్ అంటూ ఈయన ప్రశంసలు కురిపించారు.
ఇక రావణాసురుడికి మోడ్రన్ హెయిర్ స్టైల్ పెట్టారు ఆయన వేషధారణ కూడా మార్చేశారు ఇలా మార్చడం పూర్తిగా తప్పు ఇది అసలు కరెక్ట్ కాదంటూ తెలియజేశారు.ఇక సినిమాలో కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాన్ని తలపించాయని అయితే కొన్ని చోట్ల గ్రాఫిక్స్ ఏ మాత్రం బాగా లేవని తెలిపారు.
ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు తనకు ఒక నిరాశ అనేది మాత్రమే కలిగిందని ఈ విధమైనటువంటి మైథాలజికల్ సినిమాలను చేయాలి అంటే నార్త్ కన్నా సౌత్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారని సుమన్ తెలిపారు. ఇక సుమన్ కూడా ఎన్నో దేవుడి పాత్రలలో నటించారు. ఈయన కూడా శ్రీరామదాసు సినిమాలో రాముడి పాత్రలో కనిపించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా గురించి సుమన్ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…