తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తనని లాగుతూ తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు యాంకర్ ప్రదీప్. ఈమధ్య సంచలనంగా మారిన ఓ యువతిపై 139 మంది మాన భం గం కేసులో ప్రముఖ యాంకర్ ప్రదీప్ పేరు కూడా ఉంది. మిర్యాలగూడకు చెందిన ఓ యువతి పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో FIR నమోదు చేసిన పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తూ అందరికీ అరెస్ట్ వారంట్ లను పంపిస్తున్నట్లు తెలిసింది.
ఈ అంశంపై సోషల్ మీడియాలో యాంకర్ ప్రదీప్ పై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ ను షేర్ చేస్తుండటంతో తాజాగా తనపై వస్తున్న ఆరోపణలను ప్రదీప్ ఖండిస్తూ.. సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేశాడు. కొంతమంది వ్యక్తులు కావాలనే తనను టార్గెట్ చేస్తూ తనకెలాంటి సంబంధం లేని కేసులోకి లాగుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు.
ఇలాంటి వివాదస్పదమైన విషయాల్లోకి లాగుతూ తననీ.. తన కుంటుంబాన్ని ఎంతో మానసిక వేదనకు గురి చేస్తున్నారని, సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలు తననెంతో బాధ పెడుతున్నాయని, ఇలాంటి వివాదాలలో తన పేరు పెట్టి కావాలనే అటాక్ చేస్తున్నారని, అవతలి వ్యక్తులు తన పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారని, కేవలం మీడియా వ్యూస్ కోసం తననీ టార్గెట్ చేస్తున్నారని, సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాల కారణంగా తన కుటుంబం మానసికంగా బలవుతుందని, బాధితురాలికి న్యాయం జరగాలి కానీ.. నిజ నిజాలు తెలియకుండా తనని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని.. సినీ రంగంలో ఒక్కో మెట్టు ఎదిగిన తనని కావాలనే ఈ వివాదంలోకి లాగుతున్నారని, నిజ నిజాలు ఖచ్చితంగా బయటకు రావాలి’ అని ఆ వీడియో ద్వారా తెలియ జేశాడు ప్రదీప్.
ఈమధ్యేనే షూటింగ్ పూర్తి చేసుకున్న ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రంలో ప్రదీప్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇంకా విడుదల కావల్సివుంది. ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’ పాటైతే ఆడియో విడుదలైన 5 రోజుల్లోనే కోట్లాది వ్యూస్ ను సాధించడం విశేషం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…