తనపై వస్తున్న ఆరోపణలు తనని మనోవేదనకు గురి చేస్తున్నాయంటున్న యాంకర్ ప్రదీప్ !!

0
249

తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తనని లాగుతూ తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు యాంకర్ ప్రదీప్. ఈమధ్య సంచలనంగా మారిన ఓ యువతిపై 139 మంది మాన భం గం కేసులో ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ పేరు కూడా ఉంది. మిర్యాలగూడకు చెందిన ఓ యువతి పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో FIR నమోదు చేసిన పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తూ అందరికీ అరెస్ట్ వారంట్ లను పంపిస్తున్నట్లు తెలిసింది.

ఈ అంశంపై సోషల్‌ మీడియాలో యాంకర్‌ ప్రదీప్‌ పై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ ను షేర్ చేస్తుండటంతో తాజాగా తనపై వస్తున్న ఆరోపణలను ప్రదీప్ ఖండిస్తూ.. సోషల్‌ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేశాడు. కొంతమంది వ్యక్తులు కావాలనే తనను టార్గెట్‌ చేస్తూ తనకెలాంటి సంబంధం లేని కేసులోకి లాగుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు.

ఇలాంటి వివాదస్పదమైన విషయాల్లోకి లాగుతూ తననీ.. తన కుంటుంబాన్ని ఎంతో మానసిక వేదనకు గురి చేస్తున్నారని, సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలు తననెంతో బాధ పెడుతున్నాయని, ఇలాంటి వివాదాలలో తన పేరు పెట్టి కావాలనే అటాక్ చేస్తున్నారని, అవతలి వ్యక్తులు తన పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌ చేస్తున్నారని, కేవలం మీడియా వ్యూస్ కోసం తననీ టార్గెట్ చేస్తున్నారని, సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాల కారణంగా తన కుటుంబం మానసికంగా బలవుతుందని, బాధితురాలికి న్యాయం జరగాలి కానీ.. నిజ నిజాలు తెలియకుండా తనని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని.. సినీ రంగంలో ఒక్కో మెట్టు ఎదిగిన తనని కావాలనే ఈ వివాదంలోకి లాగుతున్నారని, నిజ నిజాలు ఖచ్చితంగా బయటకు రావాలి’ అని ఆ వీడియో ద్వారా తెలియ జేశాడు ప్రదీప్.

ఈమధ్యేనే షూటింగ్ పూర్తి చేసుకున్న ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రంలో ప్రదీప్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇంకా విడుదల కావల్సివుంది. ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’ పాటైతే ఆడియో విడుదలైన 5 రోజుల్లోనే కోట్లాది వ్యూస్ ను సాధించడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here