తెలుగు చలన చిత్రసీమలో యంగ్ హీరోలతో పాటు సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు యాంకర్ ప్రదీప్. దాదాపు పదేళ్లకు పైగా బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న ప్రదీప్ లక్షలాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. బుల్లితెరపై ఎన్నో షోలతో బిజీబిజీగా ఉండే ప్రదీప్ హఠాత్తుగా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ప్రదీప్ హీరోగా నటించిన తొలి చిత్రం “30రోజులలో ప్రేమించడం ఎలా?”. చిత్రం గురించీ.. ఈ చిత్రంలో బాగా పాపులరైన నీలీ నీలీ ఆకాశం పాట గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ., గత మార్చి 25న ఉగాది కానుకగా విడుదలకు సిద్దమైన ఈ సినిమా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఎంకి పెళ్ళి సుబ్బు చావుకొచ్చిందన్నట్టుగా పాపం ఇప్పటికే ఈ సినిమాకోసం ప్రదీప్ ఎంతో కష్టపడ్డాడట. ముఖ్యంగా ఈ సినిమాపైనే భారీ ఆశలను పెట్టుకున్నాడు. కానీ సడన్ గా కరోనా విజృంభించడంతో షూటింగ్ పూర్తయ్యి విడుదల కావల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి.
ఆ సినిమాల జాబితాలో మన ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.? చిత్రం కూడా వుండటంతో ప్రదీప్ చాలా నిరాశకు గురైనట్లు సమాచారం. అయినా ప్రదీప్ ఇప్పటికే సినిమా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి చాలా ఆలస్యం చేసాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు ఇప్పుడు మరో టెన్షన్ కూడా ప్రదీప్‌ను పట్టి పీడిస్తుంది. అదేమిటంటే.. విడుదలకు సిద్ధంగా వున్న సినిమాల జాబితాలో తన సినిమాతో పాటు అగ్ర హీరోల సినిమాలు కూడా వున్నాయి. ఒకవేళ థియేటర్స్ తెరిచినా అన్ని ధియేటర్స్ అగ్ర హీరోల సినిమాలతోనే నిండిపోతాయి.
ఒకవేళ ధైర్యం చేసి తన సినిమాను విడుదల చేసినా థియేటర్స్ దొరకవు. అలాగని ఖాళీగా ఉన్న థియేటర్స్ ఈ సినిమాకు సరిపోవు.. దాంతో ఇప్పట్లో ఈ చిత్రం ధియేటర్స్ లో విడుదలయ్యే ఛాన్స్ లేక ఓటిటి ప్లాట్ ఫామ్‌లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు చూస్తున్నారని తాజా సమాచారం. మొత్తానికి బుల్లితెరపై ఎన్నో అద్భుతాలు చేసిన ప్రదీప్.. వెండితెరపై మాత్రం మొదటి అడుగులోనే చతికిలబడ్డాడు. మరి మనోడి జాతకం ఎలా ఉండబోతుందో.. ఏంటో చూడాలి మరి.!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…