బండ్ల గణేష్… నిత్యం వార్తల్లో కనబడే టాలీవుడ్ సెలెబ్రిటీ. ఈమధ్యనే ‘సరిలేరు నీకెవ్వరు’ లో కమెడియన్ గా ప్రేక్షకులను అలరించిన బండ్ల గణేష్ పై ప్రస్తుతం ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. వివరాల్లోకి వెళ్తే..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మన బండ్ల గణేష్ కు కూడా సోకిందట. సోషల్ మీడియాలోకి ఈ రూమర్ ఎలా వచ్చిందో కానీ., ఇదే విషయాన్ని కొందరు మీడియా ప్రతినిధులు ఆరా తీయగా ఆ రూమర్ నిజమేనని తేలింది. ఈమధ్య కాలంలోనే బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని డాక్టర్లు ముందు జాగ్రత్తగా బండ్ల గణేష్ ను కరోనా టెస్ట్ చేయించుకోవల్సిందిగా సలహా ఇచ్చారు. డాక్టర్ల సూచనల మేరకు ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, అప్పటి వరకూ ఆయనతో రాసుకు పూసుకు తిరిగిన సన్నిహితులు కూడా ప్రస్తుతం టెస్టులు చేయించుకుంటున్నట్లు తాజా సమాచారం.
బండ్ల గణేష్‌కు కరోనా వైరస్ సోకిందనే వార్త సోషల్ మీడియాలో వైరలవ్వగానే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఈమధ్య కాలంలో బండ్ల గణేష్ ను ఎవరెవరు కలిశారు? ఆయనతో ఎవరు భేటీ అయ్యారు.? అనే కోణంలో అధికారులు కూపీ లాగున్నారు. బండ్ల గణేష్ ను
క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…